ఎసిబి అదుపులో సింగరేని ఉద్యోగి

  • ఎసిబి డిఎస్పి వై రమేష్‌
  • ఉద్యోగాల పేరిట రూ 30 లక్షల వసూళ్ళు

సింరగేణి : సింరగేణి ఉద్యోగి అన్నెబోయిన రాజేశ్వరరావు ను ఎసిబి అధికారులు మంగళవారం అదువులోకి తీసుకున్నట్లు ఎసిబి ఉమ్మడి జిల్లా డిఎస్పి వై రమేష్‌ తెలిపారు. కొత్తగూడెం పట్టణంలోని సింగరేణి కార్పోరేట్‌ ఏరియా పరిధిలోని మేయిన్‌ వర్క్‌షాప్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్న రాజేశ్వరరావు ఉద్యోగాలు ఇప్పిస్తా అంటూ నిరుద్యోగులే లక్ష్యంగా వసూళ్ళకు పాల్పడుతున్నట్లు తెలిపారు.  సింగరేణి అధికారుల సమాచారం వేరకు ఎసిబి అధికారులు దాడులు నిర్వహించామని తెలిపారు.

రాజేశ్వరరావు మరి కొందరు ముఠాగా ఏర్పడి సింగరేణి సంస్థలో ఉద్యోగ నోటిఫికేషన్‌లు విడుదల కాగానే ఉద్యోగాలు ఇప్పిస్తానని, మెడికల్‌ బోర్డు నిర్వహణలో ఉద్యోగులను అన్‌ఫిట్‌ చేసేందుకు, ట్రాన్‌ఫర్స్‌ చేయిస్తామంటూ భారీగా డబ్బులు వసూళ్ళకు పాల్పడతున్నారని వెల్లడిరచారు.

రాజేశ్వరరావు పై విజిలెన్స్‌ ఎంక్వేరీ జరిపిన అనంతంరం ఎసిబికి ఫిర్యాదు చేశారని చెప్పారు. ఉదయం అదుపులోకి తీసుకని విచారిస్తున్నట్లు తెలిపారు. ఎసిబి దాడిలో సుమారు రూ 30లక్షల వరకు వాసూళ్ళకు పాల్పడినట్లు స్పష్టం చేశారు. విచారణ కొనసాగుతుందన్నారు. ఎవరైనా లంచం అడిగితే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.

Leave a Reply

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading