నేటినుండి పాలిసెట్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌కు ఉచిత కోచింగ్‌

  • ప్రారంభించిన డైరక్టర్‌ పా వెంకటేశ్వర్లు

సింగరేణి : కొత్తగూడెం సింగరేణి ఉన్నత పాఠశాలలో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పాలిసెట్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ కోసం ఉచిత కోచింగ్‌ని నిర్వహిస్తున్నట్లు సింగరేణి డైరక్టర్‌ పా, ఎడ్యుకేషనల్‌ సొసైటీ ప్రెసిడెంట్‌ కే వెంకటేశ్వర్లు తెలిపారు. కొత్తగూడెం పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాలలో ఉచిత కోచింగ్‌ సెంటర్‌ను ప్రారంభించారు. ఈసందర్భంగా డైరెక్టర్‌ మాట్లాడుతూ సింగరేణి సంస్థ సిఎండి ఆదేశానుసారం సింగరేణి వ్యాప్తముగా 9 సింగరేణి ఉన్నత పాఠశాలలో ఉచిత శిక్షణాతరగతులు నిర్వహిస్తాము అన్నారు. ఈ నెల10 నుండి మే 10వరకు ఫ్రీ కోచింగ్‌ కొనసాగుతుందన్నారు. ఎస్‌ఎస్‌సి పూర్తి చేసిన విద్యార్ధి విద్యార్ధినులకు పాలిసెట్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ కోసం ఇచ్చే ఉచిత కోచింగ్‌ నిర్వహితున్నామని తెలిపారు. ఎంతో అనుభవం కలిగిన ఉపాధ్యాయుల నేతృత్వంలో శిక్షణ ఉంటుందన్నారు.

పదవ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు పాలిటెక్నిక్‌ విద్య అనేది చాలా గొప్ప అవకాశం అని చెప్పారు. ఈ అవకాశాన్ని పిల్లలందరు సద్వినియోగం చేసుకొని, భవిష్యత్‌కు ఒక చక్కని మార్గాన్ని నిర్దేశించుకోవాలని కోరారు. సింగరేణి ఉన్నత పాఠశాలలోని విధ్యార్ధులతో పాటు సింగరేణి ఉద్యోగుల పిల్లలకు, ప్రాజెక్టు ప్రభావిత, పరిసర ప్రాంతాల విధ్యార్ధులు పాలిసెట్‌ ఎంట్రన్స్‌లో అత్యధికముగా అర్హత సాధించే ఉద్దేశంతో మొదటిసారిగా ఉచితముగా టిఎస్‌ పాలిసెట్‌ కోచింగ్‌ను నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఎడ్యుకేషన్‌ సోసైటీ సెక్రటరీ జి శ్రీనివాస్‌, ఎస్‌వోటు డైరెక్టర్‌ పా బి సుశీల్‌ కుమార్‌, జాయింట్‌ సెక్రటరీ కే సునీల్‌ కుమార్‌, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏ సాయి సుజాత, గణితం, సైన్స్‌ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading