విద్యతోనే సామాజిక ఆర్థిక సమున్నతి

  • కాంగ్రెస్‌తోనే పేదలకు లబ్ధి చేకూరుతుంది
  • ఐవైసీ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్‌ రెడ్డి

కొత్తగూడెం : విద్య, హక్కుల పరిరక్షణ ద్వారానే సామాజిక ఆర్థిక సమున్నతి లభిస్తుందని రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివ చరణ్‌ రెడ్డి, జిల్లా అధ్యక్షులు చీకటి కార్తీక్‌, రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు ఆళ్ళ మురళి అన్నారు. చుంచుపల్లి మండలం విద్యానగర్‌ కాలనీలోని మంత్రి పొంగులేటి క్యాంప్‌ కార్యాలయంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జోతీరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, సంఘ సంస్కర్త, స్ఫూర్తిప్రదాత మహాత్మా జ్యోతి రావు పూలే అని కొనియాడారు.

మహనీయుడి సేవలు స్మరించుకుంటూ వారి ఆశయ సాధనకు అందరం పునరంకితం అవుదామని పిలుపునిచ్చారు. అనంతరం మండలంలోని సన్నబియ్యం లబ్ధిదారుడు కుంచం మురళి, రమాదేవి దంపతుల ఇంట్లో భోజనం చేశారు.పేదవాడికి సైతం రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని తీసుకొచ్చిందని, దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో సన్న బియ్యం పథకం ప్రవేశపెట్టిన ఘతన సిఎం రేవంత్‌ రెడ్డికి దక్కుతుందన్నారు. సన్న బియ్యం పథకం పేద, ధనిక అనే భేదాలు లేకుండా అందరికీ ఒకే రకమైన ఆహారం అందించేందుకు ప్రభుత్వం కృషి చేసిందన్నారు. రాజీవ్‌ యువ వికాస్‌ పథకాన్ని సద్వినియోగం చేసుకోవలన్నారు. ఈకార్యక్రమాంలో యూతన్‌ కాంగ్రెస్‌ నియోజకవర్గ అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి, టౌన్‌ అధ్యక్షుడు జయసూర్య, పవన్‌, కుంచం వెంకటేశ్వర్లు, సంపత్‌, రాము తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading