పోక్సో కేసులో జిల్లా కోర్డు సంచలన తీర్పు
- నిందితునికి జీవిత ఖైదు విధించిన జడ్జి పాటిల్ వసంత్
- అధికారులకు ఎస్పి రోహిత్ రాజు అభినందనలు

కొత్తగూడెం : పోక్సో కేసులో జిల్లా కోర్డు సంచలన తీర్పు వెలువరించింది. పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదును విధిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ గురువారం తీర్పును వెల్లడిరచారు. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన న్యాయాధికారులు, పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ ఇల్లందు మండలం తంగేళ్లగడ్డకు చెందిన భూక్య నాగేశ్వరరావు అలియాస్ నగేష్ తన బంధువు కుమార్తెలు అయిన అక్క, చెల్లెలు పై ఆఘాత్యానికి తెగబడ్డాడని చెప్పారు.
2024 జూలై 7న ఆరు సంవత్సరాల బాలికతో పాటు ఆమె నాలుగు సంవత్సరాల చెల్లెలి ఇద్దరిని చాక్లెట్ ఇస్తానని చెప్పి తన ఇంట్లోకి తీసుకొని వెళ్లి అఘాయిత్యానికి పాల్పడగా చిన్నారుల అరుపులకు నిందితుడు నాగేశ్వరరావు పారిపోయ్యాడు. బాలిక తండ్రి మరుసటి రోజు ఇల్లందు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడిరచారు.

సర్కిల్ ఇన్స్పెక్టర్ బత్తుల సత్యనారాయణ కేసు నమోదు చేసి అ సమయంలో ఇల్లందు డిఎస్పి ఇన్చార్జిగా వ్యవహారిస్తున్న కొత్తగూడెం డిఎస్పి ఎస్కే.అబ్దుల్ రెహమాన్ విచారణ చేపట్టినారని స్పష్టం చేశారు. అనంతరం ఇల్లందు డిఎస్పి చంద్రబాను ధర్యాప్తు అనంతరం కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసినారని, ప్రాసెక్యూషన్ తరఫున కోర్టులో పదిహేను మంది సాక్షులను విచారించారాని తెలిపారు.
ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరము జడ్జి భూక్యా నాగేష్ అలియాస్ నాగేశ్వరరావు పై నేరం రుజువు కావడంతో అతనికి జీవిత ఖైదు, రూ 1000 జరిమానా విధిస్తూ తీర్పును వెల్లడిరచారని పేర్కొన్నారు. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా కృషిచేసిన డిఎస్పీలు రెహమాన్, చంద్రభాను, సీఐ సత్యనారాయణ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెలగల నాగిరెడ్డి, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పివిడి లక్ష్మి, భరోసా సెంటర్ కొత్తగూడెం లీగల్ ఆఫీసర్ గద్దాడ శిరీష, కోర్ట్ నోడల్ ఆఫీసర్ ఎస్సై జి ప్రవీణ్ కుమార్, కోర్టు లైజన్ ఆఫీసర్ ఎస్కే అబ్దుల్ ఘని,కోర్టు డ్యూటీ ఆఫీసర్ తాళ్లూరి శ్రీనివాసరావులను ఎస్పీ రోహిత్ రాజు ప్రత్యేకంగా అభినందించారు.