పండుగలా బిఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ

  • వరంగల్‌లో 10 లక్షల మందితో సభ
  • అప్పులు చేయడం ఆస్తులు అమ్మడే కాంగ్రెస్‌ పని
  •  నియోజకవర్గం నుండి వేలాదిగా తరలిరండి :  రేగ, వనమా

కొత్తగూడెం : మాజీ సిఎం కెసిఆర్‌ పేరును చెరిపేయడం ఎవరి తరం కాదని, తెలంగాణ చరిత్రలో కెసిఆర్‌ మరో బాపూజీ అని బిఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు అన్నారు. అప్పులు చేయడం ఆస్తులు అమ్మడే కాంగ్రెస్‌ పని అని, కెసిఆర్‌ పాలనలో తెలంగాణ పురోగమనంలో నడిస్తే నేడు కాంగ్రెస్‌ ప్రభుత్వ రాష్ట్రాన్ని తిరోగమనంలో నడుస్తుందని ఎద్దేవ చేశారు. బిఆర్‌ఎస్‌ రజతోత్సవ వేడుకల సందర్భంగా కార్యకర్తల సన్నాహ సమావేశ సమావేశాన్ని చుంచుపల్లి మండలంలోని బిఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఈసందర్భంగా రేగా కాంతారావు, వనమా మాట్లాడుతూ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కలను సహకారంచేసి సగర్వంగా తలెత్తుకొనేలా చేసిన జెండా గులాబీ జెండా అన్నారు.

తెలంగాణ పాలిట భూతం కాంగ్రెస్‌, అబద్ధాలు, అన్యాయాలు, మోసాలు ఇది కాంగ్రెస్‌ పాలన విధానం అని, కాంగ్రెస్‌ పార్టీ మెడలు వంచడానికి ఈనెల 27న బిఆర్‌ఎస్‌ పార్టీ వరంగల్లో సభ నిర్వహిస్తుంన్నారు. ఆస్తులు అమ్మడం, అప్పులు తేవడమే ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం లక్ష్యం అని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల వాగ్దానం పచ్చి అబద్ధం, తెలంగాణ ప్రజలను మరోసారి కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఈనెల 27వ వరంగల్‌లో నిర్వహించే బిఆర్‌ఎస్‌ పార్టీ భారీ బహిరంగ సభకు కొత్తగూడెం నియోజకవర్గం నుండి ప్రజలు వేలాదిగా తరలిరావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ కమిటీ చైర్మన్‌ దిండిగల రాజేందర్‌, బిఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ వనమా రాఘవేందర్‌ గారు, సీనియర్‌ నాయకులు కిలారి నాగేశ్వరరావు, మాజీ మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ కాపు సీతాలక్ష్మి, మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ దామోదర్‌ యాదవ్‌, మాజీ ఎంపీపీలో బాదావత్‌ శాంతి, బుక్య సోనా, సొసైటీ వైస్‌ చైర్మన్‌ కాంపల్లి కనకేష్‌, మాజీ కౌన్సిలర్లు, మాజీ కో ఆప్షన్‌ సభ్యులు, మాజీ ఎంపీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వర్లు, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్‌ బత్తుల వీరయ్య,మాజీ ఉర్దూగర్‌ కమిటీ చైర్మన్‌ అన్వర్‌ పాషా,టీబీజీకేస్‌ నాయకులు కాపు కృష్ణ , మండల పార్టీ అధ్యక్షులు పూసల విశ్వనాథం, మల్లెల శ్రీరామ్‌ మూర్తి, పట్టణ అధ్యక్షులు రాజు గౌడ్‌, ప్రధాన కార్యదర్శులు బొమ్మిడి శ్రీకాంత్‌, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, మండల కమిటీ సభ్యులు, పట్టణ కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading