ఘనంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
- ప్లెకార్డులతో మెడికల్ విద్యార్థుల ర్యాలీ
కొత్తగూడెం: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా, భద్రాద్రి కొత్తగూడెంలోని ప్రభుత్వ వైద్య కళాశాల, కమ్యూనిటీ మెడిసిన్ విభాగం, వైద్య విద్యార్థులతో ఆరోగ్య అవగాహన నడక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు.1950 నుండి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుతుందని స్పష్టం చేశారు. డబ్ల్యూ హెచ్‌వో వ్యవస్థాపక దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ఆందోళన కలిగించే ఒక నిర్దిష్ట ఆరోగ్య అంశంపై దృష్టిని కేంద్రీకరిస్తుంది అన్నారు. ఈ సంవత్సరం థీమ్ హెల్తీ బిగజర్స్, హోప్‌ఫుల్ ఫ్యూచర్స్ నినాదంతో డబ్ల్యూ హెచ్‌వో దుకు వచ్చింది దుకు వచ్చిందిఅన్నారు. నివారించదగిన ప్రసూతి, నవజాత శిశువు మరణాలను అరికట్టేందుకు చేయడానికి ప్రయత్నాలను వేగవంతం చేయడం, మహిళల దీర్ఘకాలిక ఆరోగ్యం, శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలను ఎంచుకుందన్నారు. ప్రతి స్త్రీ, శిశువు మనుగడ సాగించేలా అభివృద్ధి చెందడాని సహాయం, మూడవ, మొదటి సంవత్సరం చదువుతున్న దాదాపు 200 మంది ఎంబిబిఎస్ విద్యార్థులు అవగాహన పెంచడానికి ప్లకార్డులతో నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.
విద్యార్థులతో పాటు ప్రిన్సిపల్ డాక్టర్ రాజా కుమార్, డాక్టర్ వనిత యెల్డి,హెచ్‌వోడి, కమ్యూనిటీ మెడిసిన్, డాక్టర్ హృదయ్ చందు, ఎస్‌ఆర్, కమ్యూనిటీ మెడిసిన్, డాక్టర్ రత్నమణి, హెచ్‌వోడి బయోకెమిస్ట్రీ, డాక్టర్ ప్రసన్న, అనాటమీ, సుధాకర్, ట్యూటర్, బయోకెమిస్ట్రీ, డాక్టర్ గోపాల్, డాక్టర్ స్పృతి, డాక్టర్ శ్రీవాస్తవ్, ఎంఎస్‌డబ్ల్యూ భద్రమ్మ, హెచ్‌ఈ ఆమని, లక్ష్మి భాయి, సహాయక సిబ్బంది సుమలత, శ్రవణ్, సాయి, రాంబాబులు పలుగొన్నారు.