ఆపరేషన్ కగార్ నిలిపేయాలి
- 25న సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా సదస్సు
- న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి బానోత్ ఉక్లా
కొత్తగూడెం : ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీలపై జరుగుతున్న దమనకాండను తక్షణమే నిలిపివేయాలని, కగార్ పేరుతో జరుగుతున్న హత్యాకాండ పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి బానోత్ ఉక్లా డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో కొత్తగూడెం సబ్ డివిజన్ కమిటీ నాయకురాలు వీరమళ్ళ ఉమ అధ్యక్షత ముఖ్య కార్యకర్తల సమావేశం సోమవారం నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం కేంద్రంలో ఈ నెల 25న నిర్వహించే జిల్లా సదస్సును విజయవంతం చేయాలంటూ వాల్ పోస్టర్స్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ అఖిలభారత రైతు కూలీ సంఘం(ఎఐకెఎంఎస్), ఆల్ ఇండియా కేత్ మజ్దూర్ కిసాన్ సభ(ఎఐకెఎంకెఎస్)ల ఆధ్వర్యంలో ఈనెల 25న జిల్లా కేంద్రంలో సదస్సు నిర్వహిస్తామన్నారు.
దేశంలో ముఖ్యంగా మధ్య భారతంలో ఆదివాసులపై కేంద్ర ప్రభుత్వం దాడులు హత్యాకాండను జరుపుతూ, నిత్యం నరమేధం సృష్టిస్తూ, రక్తాన్ని ఏరులై పారుస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. అడవుల్లోని సహజ, ఖనిజ సంపదను బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకు దోచిపెట్టడాన్ని ప్రతిఘటిస్తున్న ఆదివాసులను హతమారుస్తుందని స్పష్టం చేశారు. నాడుబ్రిటిష్ సామ్రాజ్యవాదులు అటవీ సహజ, ఖనిజ సంపదను కొల్లగొట్టుకొని పోతే నేడు బీజేపీ ప్రభుత్వం అంబానీ,ఆదాని లాంటి బడా కార్పొరేటు సంస్థలకు దోచిపెడుతుందని దుయ్యబట్టారు. ఎదురుతిరిగిన అమాయక ఆదివాస,ి గిరిజనులను నిత్యం ఎన్కౌంటర్ల పేరుతో చంపి, నక్సలైట్లుగా ముద్ర వేయడం ఆందోళన కలిగించే అంశాలు అన్నారు. ప్రశ్నించిన గొంతుకలను సైతం అర్బన్ నక్సలైట్లు చిత్రీకరిస్తూ జైల్లో వేస్తూ బేస్ క్యాంపులలో బందీలుగా నిర్బంధిస్తున్నారు అంటూ విమర్శించారు. ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసి జాతిహననానికి బిజెపికి చెందిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాల్పడుతున్నాయి అని మండి పడ్డారు.
ఆదివాసీలు జెల్, జంగల్, జమీన్ కోసం ఉద్యమిస్తు దేశ సంపదను, అటవీ సహజ వనరులను కాపాడుతున్నారని చెప్పారు. పరిశ్రమలు, పర్యాటక కేంద్రాల పేరుతో అడవులను కొల్లగొడుతున్నారని, కార్పొరేట్లతో మల్టీనేషన్ కంపెనీలతో కుమ్మక్కై ఆదానీ,అంబానీలతో చేతులు కలిపి దేశ మూలవాసులైన ఆదివాసీ,గిరిజనులను నిత్యం చంపుతున్నదని ఆరోపించారు. మణిపూర్, అస్సాం, పంజాబ్, కాశ్మీర్ తదితర రాష్ట్రాలలో మత ఘర్షణలు రెచ్చగొట్టి అంతులేని క్రూరహింసాకాండ కొనసాగిస్తున్నదన్నారు. పంజాబ్, ఢల్లీి, రాజస్థాన్ రాష్ట్రాల తదిత రైతులపై నిర్బంధాన్ని మోపి రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చారు. కార్మికుల ఐక్యతను చీల్చి శ్రమను దోచుకునేందుకు 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడులుగా తెచ్చారని స్పష్టం చేశారు. వీటన్నిటికీ వ్యతిరేకంగా దేశ ప్రజలు,యువకులు, కార్మికులు,విద్యార్థులు, ఉద్యోగులు,మేధావులు ప్రశ్నించే గొంతుకలను, పోరాడుతుంటే ఉక్కు పాదంతో అణచివేసి నిర్బంధిస్తుదని ఆరోపించారు.
ఈనెల 25వ తేదీన, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరిగే సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సదస్సు కామ్రేడ్స్ సనప పొమ్శయ్య,బొర్ర ఆనంద్ %Aఱసఎం%,తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకుల అధ్యక్షతన వక్తలు జస్టిస్ చంద్రకుమార్ విశ్రాంత,హైకోర్టు న్యాయమూర్తి పి టాన్యా అఖిల భారత రైతు కూలీ సంఘం జాతీయ అధ్యక్షురాలు,ఎస్ రaాన్సీ ఎఐకెఎంకెఎస్ కో-కన్వీనర్, ప్రసాదన్న ఎఐకెఎంకెఎస్ నాయకులు బి భాస్కర్ ఎఐకెఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెమిడి ఉప్పలయ్య, తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.ప్రతాప్ రెడ్డి ఎఐకెఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఈర్ల పైడి తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అరెళ్ళి క్రిష్ణ ఐఎప్‌టియు రాష్ట్ర అధ్యక్షులు బానాత్ ఊక్ల ఎఐకెఎంఎస్ రాష్ట్ర నాయకులు పాల్గొంటారని వెల్లడిరచారు.ఈ సమావేశంలో జిల్లా నాయకులు భూక్య కిష న్, వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు బానోత్ రాజేష్, జిల్లా నాయకురాలు నక్క లావణ్య, తదితరులు పాల్గొన్నారు.