సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటికి పాలాభిశేకం

లక్ష్మిదేవిపల్లి : మైలారంలో సిఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర రెవిన్యూ, గృహనిర్మాణ, సమాచారశాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చిత్రపటాలకి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు తూము. చౌదరి ఆద్వర్యంలో శనివాం పాలాభిషేకం చేవారు. లక్ష్మీదేవిపల్లి మండలం, మైలారం గ్రామాన్ని ప్రజాపాలన రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకంలో మోడల్ విలేజ్‌గా, పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరి చేసిన శుభసందర్భంగా ఈ కార్యక్రం నిర్వహించారు.
ఈసందర్భంగా తూము చౌధరి మాట్లాడుతూ దేశంలో,రాష్ట్రంలో, నిరుపేద,దళిత,గిరిజన,వెనుకబడిన,మైనార్టీ వర్గాలకు కాంగ్రెస్ పార్టీ కన్నతల్లిలా అదరిస్తుందని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో సిఎం, మంత్రి పొంగులేటి నాయకత్వములో ముందంజలో ఉందన్నారని తెలిపారు. 10 ఏళ్ల బిఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారినప్పటికీ అహోరాత్రులు కష్టపడి, నిద్రాహారాలుమాని సంపదను సృష్టించి హామీ ఇచ్చిన గ్యారింటీలతో పాటు అనేక ఆర్థిక కార్యక్రమాలు చేసిపెట్టడానికే ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం సదా సిద్ధంగా ఉందన్నారు.
ఇంకా ఈ మండలంలో, నియోజకవర్గంలో, అర్హతలు ఉండి లబ్ధి పొందని వారు ఉంటే ఖచ్చితంగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుకెళ్ళి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ టిపిసి సభ్యులు నాగ సీతారాములు, ఉపాధ్యక్షులు కూచిపూడి జగన్, పెదబాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పూణెం శ్రీనివాస్, జిల్లా మైనార్టీ కార్యదర్శి గౌస్, వజ్జరాజు, దేవరగట్ల.ప్రసాద్, వడ్డెం.సతీష్, తదితరులు పాల్గొన్నారు.