రాజీవ్ పార్క్ను సుందరంగా తీర్చి దిద్దాలి

* మున్సిపల్ కమిషనర్ కు కలిసిన కాంగ్రెస్ నాయకుల వినతి

కోతగూడెం : నూతనంగా బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్ సుజాత ను కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్లు పార్టీ నాయకులు గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. పూల బొకేలు అందించి శాలువాలు కప్పి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. కొత్తగూడెం మున్సిపల్ సమస్యలను వివరిస్తూ వినతి పత్రం సమర్పించారు. అనంతరం నాయకు మాట్లాడుతూ మున్సిపాలిటీలో అన్ని వార్డుల్లో కోతులు, కుక్కల బెడద తీవ్రంగా ఉందని, తక్షణం వాటిని పట్టించి సుదూరంగా విడిచి పెట్టించాలని కోరారు. రాజీవ్ పార్స్ లో మౌలిక వసతుల కొరతతో పట్టణంలోని ప్రజానీకం, వాకర్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పార్కులో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించి, సుందరంగా తీర్చి దిద్దాలని అన్నారు. రానున్న తీవ్ర ఎండాకాలం దృశ్య మున్సిపాలిటీలో అన్ని బస్తీల లో వార్డులలో మంచినీటి సమస్య ప్రజలకు రాకుండా చూడాలని కిన్నెరసాని మంచినీళ్లను ప్రతిరోజు టైం ప్రకారంగా ప్రజలను అందించేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. నిధులు మంజూరు చేసి పెండింగ్ లో ఉన్న వివిధ వార్డుల్లో రోడ్లు డ్రైన్లు కల్వర్టులు కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం ఏర్పాటు, అన్ని వార్డులు బస్తీలలో ఇంటి నెంబర్లతో కూడిన నేమ్ బోర్డులు, కరెంటు పోల్స్, ప్రమాద భరితంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ల తొలగింపు తదితర సమస్యలను పరిష్కరించి కొత్తగూడం మునిసిపాలిటీని అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలని చెప్పారు. సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి  ఇచ్చిన మున్సిపల్ కమిషనర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఫ్లోర్ లీడర్, సెంటర్ రైల్వే బోర్డు మెంబర్ వై శ్రీనివాస్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రావి రాంబాబు, మాజీ కౌన్సిలర్లు బాలిశెట్టి సత్యభామ, మసూద్, పరమేష్ యాదవ్, తలుగు అనిల్, కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకులు, బాలిశెట్టి సుందర్ రాజ్, పీతాంబరం, బాల ప్రసాద్, సుందర్ లాల్ కోరి, పల్లపు వెంకటేశ్వర్లు, బోసు, బండి రాజు గౌడ్, పాసి, జానీ పాషా, వాణి రెడ్డి, హైమావతి, పల్లపు వెంకటేశ్వర్లు, అమడగాని జయప్రకాశ్, హరి,రాజేష్, సాయి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading