తక్షణమే మరమ్మతు చేపట్టండి

  • బిసి బాయస్‌ హాస్టల్‌ను తనిఖీ చేసిన కలెక్టర్‌

భద్రాచలం : హాస్టల్‌ విద్యార్థులకు మెరుగైన మౌళికవసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అధికారులను ఆదేశించారు. బీసీ బాలుర వసతి గృహాన్ని కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ వసతి గృహంలోని గదులు, మరుగుదొడ్లు, బట్టలు ఎండబెట్టుకునే స్థలాన్ని, వంటగదిని, పరిశీలించారు. రోజువారీగా భోజనాన్ని ఎవరెవరు రుచి చూస్తున్నారని అడిగారు.వసతి గృహంలో గదుల డోర్లు, కిటికీలు, మరుగుదొడ్ల డోర్లు, ప్రధాన గేటు సరిగా లేకపోవటాన్ని గమనించిన కలెక్టర్‌ తక్షణమే మరమ్మతు చేయించాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం కల్టెర్‌ మాట్లాడుతూ విద్యార్థులకు భోజనం చేయడానికి వీలుగా వసతి గృహంలో డైనింగ్‌ హాల్‌ ఏర్పాటు చేయడానికి తగిన ప్రణాళికలు రూపొందించి నివేదికలు అందజేయాలని బీసీ సంక్షేమ అధికారి ఇందిరాను ఆదేశించారు. వస్తి గృహంలో పరిశుభ్రత పాటించాలని, ప్రతిరోజు మరుగుదొడ్లను శుభ్రం చేయాలని ఆదేశించారు.

విద్యార్థులకు మెనూ ప్రకారం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం స్నాక్స్‌ అందిస్తున్నారా అని తీశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, ఏరోజుకారోజు బియ్యాన్ని శుభ్రం చేసి వంట చేయాలని స్పష్టం చేశారు. వసతి గృహంలో సమస్యల పరిష్కారానికి తగిన ప్రణాళికలు రూపొందించి నివేదికలు అందజేస్తే పరిష్కరిస్తామని కలెక్టర్‌ సూచించారు.

Leave a Reply

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading