యంగ్‌ ఇండియా కే బోల్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

  • ఎన్‌రోల్మెంట్‌ తేదీ ఈ నెల 30 వరకు పొడగింపు
  • ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఐవైసి జిల్లా అధ్యక్షులు చీకటి కార్తీక్‌

భద్రాద్రి : దేశవ్యాప్తంగా యువతను మేలుకొల్పి పేదల పక్షాన ప్రశ్నించే గొంతుకలనూ తయారు చేయడమే యంగ్‌ ఇండియా కే బోల్‌ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు చీకటి కార్తీక్‌తో కలసి యంగ్‌ ఇండియా కే బోల్‌ సీజన్‌ – 5 కరపత్రాలను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశవ్యాప్తంగా యువతను పేద ప్రజల పక్షాన పోరాటంలో భాగస్వామ్యం చేయడంలో భాగంగా యంగ్‌ ఇండియా కే సీజన్‌ – 5ను ప్రారంభించినట్లు తెలిపారు. సమస్యల పరిష్కారంలో యువత ముందు వరుసలో ఉండాలనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారని స్పష్టం చేశారు. యంగ్‌ ఇండియా కే బోల్‌లో పాల్గొనే యువత పేర్ల నమోదుకు ఈ నెల 30 వరకు పొడిగించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలనుకునే యువతి యువకులు గూగుల్‌ లో లింక్‌ అందుబాటులో ఉందని, అందులో వివరాలను పొందుపరిచే భాగస్వాములు కావచ్చన్నారు. గెలుపొందిన వారికి నగదు బహుమతుల ప్రధానం ఉంటుందని తెలిపారు. ఇందులో గెలిచిన వారికీ ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధిగా నియమించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గం అసెంబ్లీ ప్రెసిడెంట్‌ తరుణ్‌ రెడ్డి, చైతన్య, రవి, గుండాల మండల ప్రెసిడెంట్‌ అశోక్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి మతిన్‌, పవన్‌, సుజాతనగర్‌ మండల ప్రెసిడెంట్‌ శ్రీకాంత్‌, చుంచుపల్లి మండల ప్రెసిడెంట్‌ శివ, ఇల్లందు ఏఎంసి చైర్మన్‌, గుండాల కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading