వార్డు ప్రజల ఆదరణ మరువలేనిది

  • కరోనాలో ప్రజలకు అండగా నిలిచా
  • అవినీతి రహిత పాలన అందించా వై శ్రీనివాస్‌ రెడ్డి

కొత్తగూడెం : వార్డుతోపాటు కొత్తగూడెం మున్సిపల్‌ ప్రజా సమస్యల పరిష్కారం సమగ్ర అభివృద్ధి కోసం పోరాడాని, కౌన్సిలర్‌గా వార్డు అభివృద్ధికి ఎంతగానో కృషి చేశానని రైల్వే బోర్డు మెంబర్‌, మాజీ కౌన్సిలర్‌ వై శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీలో పదవీ విరమణ కార్యక్రంలో ఆయన మాట్లాడుతూ వార్డులో అన్ని ప్రధాన రోడ్లు, గల్లీ రోడ్లు, సైడ్‌ కాలువలు, కల్వర్టులు, నిర్మాణం పూర్తి చేశానని, వార్డు ప్రజలు సమావేశాలు నిర్వహించేందుకుగాను రూ 50 లక్షల నిధులు సాధించి కమ్యూనిటీ హాల్‌ నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. కిన్నెరసాని మంచినీళ్లను ప్రతిరోజు టైం ప్రకారంగా అందించాలని పోరాడుతూనే వార్డులో రెండు పవర్‌ బోర్లు సాధించి నిర్మాణం చేసి పబ్లిక్‌ టాప్స్‌ ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. వార్డులో నాలుగు ట్రాన్స్‌ ఫార్మర్స్‌ఏర్పాటు చేసిలో వోల్టేజి సమస్యను పరిష్కరించినట్లు పేర్కొన్నారు.

32 మంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇంటి స్థలాలు 20 మందికి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లతో పాటు ప్రస్తుత ప్రజాపాలనలో అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు, ఇంటి స్థలాలు, రేషన్‌ కార్డులు అందించేందకు కృషి చేశాను అన్నారు. గతంలో వస్తున్న 259 ఆసరా పింఛన్లు కాకుండా మరో 54 మందికి కొత్త ఆసరా పింఛన్లు మంజూరు చేపించానని, అర్హులందరికీ పింఛన్లు ఇప్పించడానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నను అన్నారు.69 మంది అక్కా చెల్లెమ్మలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులు ఒక్క రూపాయి లంచం లేకుండా ఇప్పించినట్లు తెలిపారు. జివో 76 ద్వారా 299మందికి రిజిస్ట్రేషన్‌ పట్టాలు ఒక్క రూపాయి లంచం ఇచ్చామన్నారు.కరోనా కష్టకాలంలో కూరగాయలు, పండ్లు, గుడ్లు, భోజనం ప్యాకెట్స్‌ నిత్యవసరాలు, మందులు పంచడంతోపాటు బ్లీచింగ్‌, స్ప్రే ,చేపిస్తూ ప్రజలకు అండగా ధైర్యంగా నిలబడ్డానని స్పష్టం చేశారు. భవిష్యత్తులో పదవి ఉన్న లేకున్నా ప్రజా సమస్యల పరిష్కారానికి అభివృద్ధి పనుల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం అధికారుల సహకారంతో, రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అండదండలతో, రాష్ట్ర మంత్రులు మల్లు బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వర రావు, ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కాంగ్రెస్‌ పెద్దల సహకారంతో శక్తి వంచన లేకుండా ప్రజలకు అండగా ఉంటానని పేర్కొన్నారు.

Leave a Reply

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading