రోడ్డు భద్రత మనందరి బాధ్యత

  • టూ టౌన్ ఎస్ఐ భూక్య శ్రీనివాస్
రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా అవగాహన కల్పిస్తున్న టూ టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ భూక్యా శ్రీనివాస్

రుద్రంపూర్ : జాతీయ రోడ్డు భద్రత మహోత్సవాలు భాగంగా ఈరోజు కొత్తగూడెం ఏరియా పరిధిలోని ప్రొఫెసర్ జయశంకర్ మైదానంలో, వాకర్స్, యువకులకు ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కొత్తగూడెం టూ టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ భూక్య శ్రీనివాస్ మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్థితులలో వాహనాలు అధికంగా పెరగడంతో రోడ్డుపై ట్రాఫిక్ సమస్యల వలన ప్రయాణికుల భద్రత విషయంలో తీసు కోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు, సలహాలు అందించారు. మీరు వాహనాలు డ్రైవింగ్‌ చేసేటప్పుడు సంయమనం పాటించాలని, సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేయరాదని, నిర్ధేశిత వేగాన్ని మించి మీ వాహనాలను నడపవద్దన్నారు. ఇతర వాహనా లకు ఇబ్బంది కలిగేలా వాహనాలను పార్కింగ్‌ చేయవద్దన్నారు. వాహనాలను ఓవర్‌ టేక్‌ చేస్తున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని, సురక్షితంగా ప్రయాణికుల ను గమ్యస్ధానాలకు చేర్చాలని, ట్రాఫిక్స్‌ సిగ్నల్స్‌ పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ ఏఎస్ఐ ఏస్తారు రాణి, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు,రమేష్ , స్థానికులు పాల్గొన్నారు.

Leave a Reply

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading