రద్దైన రైళ్ళను పునరుద్ధరించాలి

  • అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయండి
  • రైల్వే స్టేషన్‌ను సందర్శించిన బోర్టు మెంబర్‌ శ్రీనివాస్‌ రెడ్డి
  • సత్కరించిన రైల్వే అధికారులు, యూనియన్‌ నాయకులు

కొత్తగూడెం : కరోనా సమయంలో రద్ధైన రైళ్ళను త్వరితగతన పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృషికి తీసుకెళ్ళాలని సికిందద్రాబాద్‌ డివిజన్‌ రైల్వే స్టేషన్‌ను సందర్శించిన బోర్టు మెంబర్‌ శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. కొత్తగూడెం రైల్వే స్టేషన్‌ని సందర్శించి అధికారులతో పలు అంశాలను, సమస్యలను చర్చించి రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాలో రద్దయిన కొలహపూర్‌ ఎక్స్ప్రెస్‌, కాజిపేట్‌, డోర్నకల్‌ ప్యాసింజర్‌ రైళ్లును పునరుద్ధరించాలని, భద్రాచలం రైల్వే లైన్‌ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలని తెలిపారు.

కొత్తగూడెం కేంద్రంగా కొవ్వూరు రైల్వే జంక్షన్‌ ఏర్పాటు చేయాలని, కొత్తగూడెం నుండి పుణ్యక్షేత్రమైన తిరుపతికి ప్రత్యేక స్పెషల్‌ ట్రైన్‌ ఏర్పాటు చేయాలని మణుగూరు నుండి డోర్నకల్‌ వరకు మంజూరైన డబుల్‌ రైల్వే ట్రాక్‌ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని చెప్పారు.

కొత్తగూడెం నుండి బల్లర్ష వరకు వెళ్లే సింగరేణి ట్రైన్‌లో కూర్చోవడానికి సీట్లు, టాయిలెట్స్‌ తదితర వసతులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని తక్షణం పుష్పుల్‌ ట్రైన్‌ మార్చి పాత ట్రైన్‌ ని ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలని, రైల్వే స్టేషన్లో క్లీన్‌ అండ్‌ గ్రీన్‌, వెయిటింగ్‌ హాల్స్‌, తదితర సౌకర్యాలను నిరంతరం నిర్వహించాలని అధికారులకు విన్నవించారు. ఎస్కులేటర్‌ను నిర్మించాలి అన్నారు. కొత్తగూడెం నడి బొడ్డులో ఉన్న రాజీవ్‌ పార్క్‌ ప్రగతి మైదాన్‌ ఉన్నందున ప్రజల సౌకర్యం కోసం దారి కల్పించాలి అన్నారు. ఈ సందర్భంగా ఏరియా ఆఫీసర్‌ మీనా మాట్లాడుతూ సమస్యలను పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు, ముందుగా స్టేషన్‌ను సందర్శించిన సందర్భంగా శ్రీనివాస్‌ రెడ్డిని రైల్వే అధికారులు యూనియన్‌ నాయకులు స్వాగతించి ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఏరియా ఆఫీసర్‌ మీనా, ఏరియా ఇన్స్పెక్టర్‌ పాషా, స్టేషన్‌ సివిల్‌ ఇంజనీర్‌ జావేద్‌, సికింద్రాబాద్‌ డివిజన్‌ యూనియన్‌ ప్రెసిడెంట్‌ కాజా బాబాతో పాటు కాంగ్రెస్‌ నాయకులు బాల ప్రసాద్‌ రాజేష్‌, శ్యామ్‌, మాజీ స్టేషన్‌ మాస్టర్‌ చలం, నాయకులు రామారావు రవితేజ, సైదులు, శ్రీనివాస్‌, వెంకటేష్‌, సత్యనారాయణ ,శ్రీకాంత్‌, పవన్‌ తదితరులు పాల్గొన్నారు

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading