సంతలో ఎగిసిపడిన మంటలు
- ఆగ్ని ప్రమాదంలో రూ 3లక్షల ఆస్థి నష్టం

కొత్తగూడెం : కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని సింరగేణి హెడ్ ఆఫీస్ సమీపంలోని వారంతపు సంతలో విద్యుత్ షాట్ సర్యూట్‌తో ఆగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం కాండంతో కూరగాయలు, చిరు దాన్యాలు కొనేందుకు సంతకు పెద్ద ఎత్తున ప్రజలు సంతకు వచ్చారు. వ్యాపారుల కోసం సంతలో నిర్మించిన షేడ్‌లో సాయంత్రం వేళ కరెంటు షాట్ సర్యూట్‌తో ఒక్క సారిగా మంటలు ఎగిసి పడ్డాయి.
దీంతో జనాలు కాంగారుతో పరుగులు తీశారు. అగ్ని ప్రమాదంలో వ్యాపారుల లావాదేవీలకు చెందిన ఫైల్స్, అకౌంట్ బుక్స్, ఫర్నీచర్, సిస్టంమ్స్ పూర్తిగా దగ్ధం అయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ 3లక్షల ఆస్థి అగ్నికి ఆహూతి అయినట్లు సమాచారం. అగ్ని మాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేయడంతో ప్రాణ నష్టం కలకగ పోడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.