రైతులకు బేడీలు వేయడమే ప్రజా పాలనా ?
- లగచర్ల బాధితులకు అండగా బిఆర్‌ఎస్
- మాజీ మంత్రి వనమా

కొత్తగూడెం : లగచర్ల రైతులకు న్యాయం జరిగే వరకూ బిఆర్‌ఎస్ పార్టీ అండగా నిలిచి పోరాటం కొనసాగిస్తామని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గం ఇంచార్జ్ వనమా వెంకటేశ్వరరావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు నుంచి సామాన్యుడు వరకు రాష్ట్రంలో అందరూ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని వమిర్శించారు. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆదేశం మేరకు మంగళవారం కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్‌లోని బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి నిరన తెలిపారు. ఈ సందర్భంగా వనమా మాట్లాడుతూ హక్కుల కోసం నిలదీసిన రైతులకు బేడీలు వేసి నేరస్తులుగా చిత్రీకరించడమేనా ప్రజా పాలన అంటే అని ప్రశ్నించారు.
లగచర్ల రైతుల భూములను ఫార్మా కంపెనీలకు దోచి పెట్టడానికే తప్పా మరొకటి కాదని తెలిపారు.తెలంగాణలో నిర్భంద పాలన జరుగుతుందని ఆరోపించారు. ఇచ్చిన హామీలు అమలుకు నోచకోడం లేదన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ రైతులకు బేడీలు వేసి జైళ్ళకు తరలిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, మాజీ ఎంపీపీ బాదావత్ శాంతి, పాల్వంచ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్, మాజీ ఉర్దూగర్ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా, రాజు గౌడ్,టి రాజశేఖర్, అనుదీప్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, వార్డు మెంబర్లు, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.