అస్తమించిన ఉద్యమ భాస్కరుడు
నివాళులర్పించిన వనమా, రేగా
కొత్తగూడెం : తెలంగాణ ఉద్యమ భాస్కరుడు అస్తమించాడు. ఉద్యమ నేత, మాజీ సీఎం కేసీఆర్ స్పూర్తితో తెలంగాణ కోసం నెనుసైతం అంటూ వెంటనడిచిన ఉద్యమకారుడు, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మోర భాస్కర్ అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ విషయం తెలిసి మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆయన స్వగృహానికి వెళ్లి మొరె భాస్కర్ పార్థివ దేహాన్నికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు.వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రంథాల మాజీ కమిటీ చైర్మన్ దిండిగల రాజేందర్, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్,కౌన్సిలర్ అంబుల వేణు, మాజీ ఎంపీపీ బాదావత్ శాంతి,మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య,మాజీ ఉర్దూ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా, కౌన్సిలర్లు,కో ఆప్షన్ సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు,బొందుగల శ్రీధర్, బొమ్మిడి రమాకాంత్,అహ్మద్, మసీద్, అరుణ్, గౌస్, సురేందర్,కార్యకర్తలు, నాయకురాలు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.