బైక్ దొంగ అరెస్టు
- 8 బైకులు పోలీసుల స్వాధీనం

కోతగూడెం : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బైకుల చోరీకి పాల్పడుతున్న వ్యక్తిని వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేసినట్లు సిఐ ఎం కరుణాకర్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు సిఐ వెల్లడిరచారు. ఈజీ మనికి అలవాటు పడిన భద్రాచలం పట్టణానికి చెందిన గుమ్మడి రాజు గత కొంతకాలంగా ద్విచక్ర వాహనాలను దొంగిలించి వాటిని విక్రయిస్తూ జల్సా జీవితాన్ని గడుపుతున్నాడు.
మంగళవారం రాత్రి కోతగూడెం బస్టాండ్ సెంటర్‌లో పోలీసులు సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా రాజు ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించింది. అతన్ని పోలీసులు ప్రశ్నించగా పొంతన లేని సమాధానం చెప్పడంతో రాజును అదుపులోకి తీసుకొని విచారించారు. ఇటీవల కాలంలో ఖమ్మంలో రెండు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆరు ద్విచక్ర వాహనాలను దొంగిలించినట్లు అంగీకరించాడు. అతని అరెస్టు చేసి 8 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ స్పష్టం చేశారు. దొంగను పట్టుకోవడంలో కృషిచేసిన సీఐ కరుణాకర్, కానిస్టేబుల్ శంకర్ సురేష్ నరేష్‌లను డిఎస్పి అబ్దుల్ రహమాన్ ప్రత్యేకంగా అభినందించారు.