ఫోక్సో కేసులో ఐదేళ్ళ జైలు శిక్ష

కొత్తగూడెం : ఫోక్సో కేసులో వ్యక్తికి ఐదు ఏళ్ళు కఠిన కారాగార శిక్ష విధిస్తూ కొత్తగూడెం జిల్లా ప్రధాన జడ్జి (ఎఫ్‌ఎసి ఫోక్సో స్పెషల్‌ కోర్టు) పాటిల్‌ వసంత్‌ తీర్పు చెప్పారు. కేసు వివరాలు ఇలా ఉన్నాయి. 2022 అక్టోబర్‌ 27న అశ్వాపురం గ్రామానికి చెందిన 12 ఏళ్ళ మైనర్‌ బాలిక పిల్లలతో ఆడుకోవడానికి వెళ్లే క్రమంలో తన ఇంటి సమీపంలోని సుగ్గల ఉమామహేశ్వరరావు అలియాస్‌ నాని వీడియో కాల్‌ ద్వారా అసభ్యకరమైన సమాచారం పెట్టడంతో బాధితురాలు ఏడుస్తూ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది.

ఈ ఘటనకు వారం క్రితమే తోటి పిల్లలతో ఆడుకునేందుకు వెళ్ళిన చిన్నారిని కామాందుడు మామహేశ్వరరావు బెడ్‌ రూమ్‌లోకి ఎత్తుకొని వెళ్లి దుస్తులు విప్పాలని బెదిరించడంతో బాధితురాలు అరిచి విడిపించుకుని వచ్చేసింది. సెల్‌ ఫోన్‌లో తప్పుడు మెసేజ్‌లు, దురుద్దేశంతో వీడియోలు పెడుతున్నాడని చెప్పింది. బాదితురాలి కుటుంబం ఫిర్యాదు మేరకు అప్పటి అశ్వాపురం పిఎస్‌ సబ్‌ ఇన్స్పెక్టర్‌ నాగుల్‌ మీరఖాన్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం కోర్టులో ఉమామహేశ్వరరావు పై ఛార్జిషీట్‌ దాఖలు చేశాడు.

ప్రాసెక్యూషన్‌ తరఫున ఎనిమిది మంది సాక్షులను విచారించారు. ఉమామహేశ్వరరావు పై నేరం రుజువు అయ్యింది. జడ్జి ఐదు సంవత్సరాల కఠిన కారాగారా శిక్షతో పాటు రూ 10వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరిచారు. ప్రాసిక్యూషన్‌ తరఫున ఫోక్సో స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వెలగల నాగిరెడ్డి నిర్వహించారు. కోర్టు లైజాన్‌ ఆఫీసర్‌ షేక్‌ అబ్దుల్‌ ఘని, (కోర్టు డ్యూటీ ఆఫీసర్‌) పిసిఎం ఈశ్వర్‌ సహకరించారు.

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading