ఇద్దరు మావోల అరెస్టు
- కీలప పత్రాలు, సాహిత్యం స్వాధీనం
- అరణ్యం వీడి జనజీవన స్రవంతిలో కలవాలి
- జిల్లా ఎస్పి రోహిత్ రాజు
కొత్తగూడెం : ఇద్దరు మావోయిస్టులతో పాటు కొరియర్‌ను చర్ల పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు జిల్లా ఎస్సి రోహిత్ రాజు వెల్లడిరచారు. చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని దానవాయిపేట గ్రామ శివారులో ఉదయం వాహన తనిఖీలు చేపట్టగా వరంగల్ నుండి వైద్య చికిత్సల అనంతరం చత్తీస్గద్ బీజాపూర్ జిల్లాకు చెందిన కరటం జోగా ఏ రాజేష్, పూనమ్ జోగాల్ అలియాస్ రాజులతో పాటు కొరియర్‌గా పనిచేస్తున్న చర్ల మండలానికి చెందిన ఎం గీతా గాయత్రి (డిఐవో) తిరిగి అడవిలోకి వెళ్తున్న సమయంలో పోలీసులు అరెస్టు చేసినుట్ల తెలిపారు. వీరి వద్ద నుండి నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన ముఖ్యమైన పత్రాలను, విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడిరచారు.
వీరితో పాటు ఒక మహిళా కొరియర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు స్పష్టం చేశారు. చత్తీస్గడ్ రాష్ట్రం సూకుమా జిల్లా బూరుగులంక గ్రామానికి చెందిన కరటం జోగా ఏ రాజేష్ (55) నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీలో 1994లో చేరాడని, 1994 నుండి 1998 వరకు నాలుగు ఏళ్ళ పాటు కిష్టారం ఏరియా కమిటీలో పార్టీ సభ్యుడిగా పనిచేశాడన్నారు. 1998లో ఏరియా కమిటీ మెంబర్‌గా ప్రమోషన్ పొంది 2006 వరకు కిష్టారం ఏరియా కమిటీలో పనిచేశాడు. 2006లో డివిసిఎంగా ప్రమోషన్ పొంది కిష్టారం ఏరియా కమిటీ సెక్రటరీగా 2010 వరకు పని చేసినట్లు చెప్పారు. అదే ఏడాదిలో సౌత్ బస్తర్‌లోని 6వ ప్లాటూన్ డివిజన్ కమిటీకి బదిలీ చేయబడి 2013 వరకు అక్కడ పని చేశాడన్నారు.
2013 నుండి 2019 వరకు సౌత్ బస్తర్ డివిజన్ మిలటరీ విభాగానికి ఇన్చార్జిగా 2020 వరకు పనిచేశాడని పేర్కొన్నారు. అనంతరం అదే ఏడాదిలో సౌత్ బస్టర్ డివిజన్ మిలటరీ విభాగానికి సాంకేతిక విభాగానికి ఇంచార్జీగా పని చేసి 2021లో డికెఎస్‌జడ్‌సిలో ఎస్‌జడ్‌సిఎంగా ఎదిగాడు. ఇతనిపై రూ 20 లక్షల రివార్డ్ ఉన్నట్లు చెప్పారు. మావోయిస్టు పార్టీ అగ్రనాయకులతో కలిసి బీజాపూర్, సుక్మా జిల్లాలలో భద్రతా బాలగాలపై జరిగిన అనేక హింసాత్మక ఘటనలలో పాల్గొన్నట్లు స్పష్టం చేశారు.
పార్టీలో సీనియర్ క్యాడర్లలో పనిచేస్తూ 60 ఏళ్ళ వయసు నిండిన వారు చాలామంది తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారని, సరైన వైద్య సదుపాయాలు అందక, చికిత్స తీసుకోలేక సతమతమవుతున్నట్లు సమాచారం ఉందన్నారు. మావోయిస్టు పార్టీలోని అజ్ఞాత సాయుధ దళాలలో పనిచేస్తున్న నాయకులు, దళసభ్యులు ముఖ్యంగా ఆరోగ్యం సహకరించని వారు పోలీసుల ఎదుట లొంగిపోవాలని కోరారు. జనజీవన స్రవంతిలో కలిసి మెరుగైన జీవితాన్ని గడపాలని పోలీసు శాఖ విజ్ఞప్తి చేస్తుందన్నారు. లొంగిపోయి ప్రజాస్వామ్యబద్దంగా ప్రజల తరఫున పోరాడి నిర్మాణాత్మకంగా రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములు కావాలని కోరారు.
- ఘటనల వివరాలు

2010లో తాడ్ మెట్ల అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలపై దాడి చేసిన ఘటనలో 75 మంది పోలీసులు మరణించారు. 2014లో తొంగ్ పాల్ అటవీ ప్రాంతంలో భద్రతా బాలగాలపై దాడి చేసిన ఘటనలో 11 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. 2017లో బెజ్జి అటవీ ప్రాంతంలో పోలీసు బలగాలపై కాల్పులు జరిపి 11 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలో, 2017లో బుర్కపాల్ పోలీస్ క్యాంపు పై దాడి చేసి 25 మంది ప్రాణాలను బలి తీసుకున్న ఘటనలో పాల్గొన్నాడు. 2018లో కిష్టారం అటవీ ప్రాంతంలో ఐఈడి పేల్చి 9 మంది పోలీసులు ప్రాణాలో కోల్పోయిన ఘటనలో పాల్గొన్నాడు. 2020లో ఎర్రపల్లి అటవీ ప్రాంతంలో బిజిఎల్ ఆయుధంతో కాల్పులు జరిపి ముగ్గురు ప్రాణాలు. 2020లో మినప భద్రతా బలగాలపై కాల్పులు జరిపి 17 మంది పోలీసులను చంపిన ఘటనలోను, 2021లో టేకులగుర్మా అటవీ ప్రాంతంలో కాల్పులు జరిపి 22 మంది పోలీసుల ప్రాణాలను హరించిన ఘటనలో ఉన్నాడు.
2022లో చెన్నాపురం క్యాంపుపై దాడి, 2024లో ధర్మారం, చింతవాగు, సామేడు సిఆర్‌పిఎఫ్ క్యాంపులపై దాడి, 2024లో టిసివోసి సమయంలో టెలకుగుడం సిఆర్‌పిఎఫ్ క్యాంపు పై సహచరులతో కలిసి దాడిలో పాల్గొన్నాడు. చత్తీస్గద్ బీజాపూర్ జిల్లా గొండపల్లి గ్రామానికి చెందిన పూనమ్ జోగాల్ అలియాస్ రాజు (20) నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీలో 2022లో చేరి సౌత్ బస్తర్ డివిజన్, జేగురుగొండ ఏరియా కమిటీలోని బాసగూడ ఎల్‌వోఎస్ సభ్యునిగా పని చేశాడు.
ఏరియా కమిటీ సభ్యుడు శంకర్ ప్లాటూన్ సభ్యులు గంగా, సుక్క, ఉంగాల సారధ్యంలో ఇతను పనిచేశాడు. 2024 జూన్‌లో కరటం జోగాకు సహాయకుడిగా అతని వద్దకు వచ్చి, అతనిని వైద్య చికిత్సలకు బయటకు తీసుకొస్తూ ఉండేవాడు. ఇందులో భాగంగానే సోమవారం వరంగల్‌లో చికిత్స చేయించుకుని వస్తుండగా పోలీసులకు పట్టుబడ్డాడు. మావోయిస్టు పార్టీ అగ్రనాయకులతో కలిసి బీజాపూర్, సుక్మా జిల్లాలలో భద్రతా బాలగాలపై జరిగిన హింసాత్మక సంఘటనలో పాల్గొన్నాడు. 2024లో ధర్మారం, చింతవాగు పామేడు సిఆర్‌పిఎఫ్ క్యాంపులపై దాడి చేసిన ఘటనలో పాల్గొన్నాడు. 2024లో టిసిసి సమయంలో బెలకుగురం సిఆర్‌పిఎఫ్ క్యాంపు పై దాడి ఘటనలో తన సహచరులతో కలిసి పాల్గొన్నాడు. చర్ల మండలానికి చెందిన ఎం గీతా గాయత్రి, డిఐవో(43) మావోయిస్టు పార్టీ కొరియర్‌గా పనిచేస్తుంది. మావోయిస్టు పార్టీకి సానుభూతిపరురాలిగా ఉంటూ కొరియర్‌గా వ్యవహరిస్తుంది.