మహిళల భద్రతే ప్రధాన లక్ష్యం

షీ టీమ్స్‌, ఎహెచ్‌టియూ కార్యాలయాల్ని ప్రారంభించిన ఎస్పీ రోహిత్‌ రాజు

భద్రాద్రి : మహిళలలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు వీలుగా తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ శాఖ తరపున టిజిడబ్ల్యూఎస్‌డబ్ల్యూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన విభాగమే షీ టీమ్స్‌ అని జిల్లా ఎస్పీ రోహిత్‌ రాజు అన్నారు.

చుంచుపల్లి పాత పోలీస్‌ స్టేషన్‌ భవనంలోకి మార్చిన షీ టీమ్స్‌, ఎహెచ్‌టియూ కార్యాలయాలను జిల్లా ఎస్పీ ప్రారంభించారు. మహిళలపై లైంగిక వేధింపులు, ర్యాగింగ్‌, ఈవ్‌ టీజింగ్‌,బ్లాక్మెయిలింగ్‌, ఇతర ఇబ్బందులు ఎదుర్కునే మహిళలు జిల్లా షీ టీమ్స్‌ను నేరుగా సంప్రదించాలిని తెలిపారు. జిల్లా షీ టీమ్స్‌ ఫోన్‌ నంబరు 8712682131కి కాల్‌ చేసి సమస్యలపై చెప్పాలని అన్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు పూర్తిగా గొప్యంగా ఉంచుతామన్నారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే నేరస్తుడిని షీ టీం కార్యాలయానికి పిలిచి తల్లీదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్‌ ఉంటుందని తెలిపారు. పరిస్థితిని బట్టి నిందితుడిపై కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. బాలికలకు, మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నిర్భయంగా షీ టీమ్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు. జనాలు రద్దీగా ఉండే ప్రదేశాలలో, రైల్వేస్టేషన్‌, బస్టాండ్లు, కళాశాలల వద్ద షీ టీమ్స్‌ సభ్యుల నిరంతరం నిఘా ఉంటుంది అన్నారు. ఆకతాయిల ఆగడాలను అరికడతారని స్పష్టం చేశారు.హూమన్‌ట్రాఫికింగ్‌ను నివారించడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం అన్నారు.

మానవ అక్రమ రవాణా చేసి వారి అవయవాలను విక్రయించడం, వెట్టిచాకిరీ చేయించడం, వ్యభిచారంలోకి లాగడం, బాల్య వివాహాలలాంటివి జరగకుండా జిల్లాలో ఎహెచ్‌టియూ పని చేస్తుందని తెలిపారు.ఇటువంటి నేరాలు జరగకుండా ఉండడానికి నిరంతరం జిల్లా మొత్తం అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది.మఫ్టీ దుస్తులలో సంచారిస్తూ నేరాలు జరగడానికి అవకాశం ఉండే ప్రదేశాలలో ఎహెచ్‌టియూ, షీ టీం సిబ్బంది తిరుగుతుంటారని తెలిపారు.ఈ సంవత్సర కాలంలో షీ టీం ఎహెచ్‌టియూ బృందాలు కలిసి జిల్లాలోని వివిధ పోలీస్‌ స్టేషన్లలో 47కు పైగా కేసులు,47 పెట్టీ కేసులు(రెడ్‌హ్యాండెడ్‌), 92 అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ ఆపరేషన్స్‌ పరితోష్‌ పంకజ్‌ ఐపిఎస్‌, కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్‌,చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు,ఎస్బి ఇన్స్పెక్టర్స్‌ నాగరాజు,శ్రీనివాస్‌ మరియు 1టౌన్‌ సీఐ కరుణాకర్‌,2టౌన్‌ సీఐ రమేష్‌, సైబర్‌ క్రైమ్స్‌ సీఐ జితేందర్‌,ఆర్‌ఐలు సుధాకర్‌,రవి,లాల్‌ బాబు,కృష్ణారావు షీ టీమ్స్‌ ఇంచార్జి ఇన్స్పెక్టర్‌ నాగరాజు రెడ్డి,ఆర్‌ఎస్సై రమాదేవి, ఇతర పోలీస్‌ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading