సారపాకలో నాటుసారా !
పట్టుకొని పోలీసులకు అప్పగించిన స్థానికులు

భద్రాద్రి : బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక గ్రామంలో సుమారు 40 లీటర్ల గుడుంబా స్థానిక యువకులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. భద్రాచలం మీదుగా ప్రతి రోజూ సారపాకలోని పలు ప్రాంతాల్లోకి వందల లీటర్లలో గుడుంబా వస్తున్నట్టు సమాచారం. ఆటోతో పాటు గుడుంబాను పోలీస్ స్టేషన్‌కి తరలించినట్టు తెలుసోతంది. మండలంలో ప్రతి రోజూ వందల లీటర్ల గుడుంబా తయారీ అమ్మకాలు జరుగుతున్న సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో పేద ప్రజల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయని గ్రామస్తులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధికార యంత్రాంగం గుడుంబా పై ఉక్కుపాదం మోపకపోతే ప్రజల ప్రాణాలు గాలిలో కలిసే ప్రమాదం లేకపోలేదు.