ఎంపి ఆర్ఆర్ఆర్ ఆర్థిక సహాయం

బాధిత కుటుంబానికి అండగా ప్రభుత్వం

పాల్వంచ : బాధిత కుటుంబానికి  ప్రభుత్వం  అండగా నిలుస్తుందని ఖమ్మం ఎంపి రామసహాయం రఘురామ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. పాల్వంచ మండలం దంతెలబోర గంగదేవిగుప్ప గ్రామంలో ప్రమాదవశాత్తు వరద ఉధృతికి కొట్టుకుపోయిన జారే సాయి కృష్ణ స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను కలిసి సానుభూతి వ్యక్తం చేశారు. సాయి కృష్ణ కుటుంబానికి ప్రభుత్వం తరపున న్యాయం జరిగేలా చూస్తానని ఎంపి  హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా దుర్ఘటన అనంతరం చేపడుతున్న  చర్యలపై ఆరా తీశారు. సత్వరమే బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో కాంగ్రెస్ నాయకులు ఆళ్ళ మురళి, నాగేంద్ర త్రివేది, టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శీను, కొత్తగూడెం సోసైటీ చైర్మన్ మండే వీరహనుమంతరావు, ఐఎన్ టియూసి ఏరియా ఉపాధ్యక్షుడు రజాక్ స్థానిక్ పాల్గొన్నారు.

Leave a Reply

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading