సిగరెట్ చిచ్చు

స్నహితుడే యముడయ్యాడు
యువకుడి దారుణ హత్య
భద్రాద్రి: స్నేహాన్ని కన్న మిన్న ఈ లోకంలో మరొకటి లేదనేది జగమెరిగిన సత్యం. కడదాక తోడు నిలవ్సాంది పోయి ప్రాణ స్నేహితుడిని కొట్టి చంపేలా చేసింది అ స్నేహం. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ అన్నట్లు కసి మెలసి తిరిగారు, కసే తాగారు. ఏమైందో ఏమోగానీ ఒక్కసారీగా స్నేహ బందం మరిచారు ఒకరికొకరు బద్ద శతృవుల్లా మారారు. సిగరెట్ ఇద్దరి స్నేహితుల మధ్య చిచ్చు రాజేసింది. అంతే మద్యం మత్తులో ఉన్న యువకులు ఒకరిపై మరొకరు దాడి చేసుకుని ఖూనీకి దారితీసిన అమానుష ఘటన కొత్తగూడెం పట్టణంలో జరిగింది.
కొన్ని స్నేహాలు సిగరేట్‌తో చిగురిస్తే అదే సిగరేట్ సాయి, సందీప్‌ల ఫ్రెండ్‌షిప్‌కు ఎండ్ కార్డు వేసి సాయిని ముద్దాయిలా మార్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. సింగరేణి ఉద్యోగం నిమిత్తం సందీప్ త్లదండ్రులు సత్తుప్లలో ఉంటున్నారు. అయితే సందీప్ కొత్తగూడెం పట్టణంలోని గాజులరాజం బస్తీలో తన అమ్మంమ్మ ఇంట్లో ఉంటున్నాడు.
సోమవారం దీపావళి పండగ అవ్వడంతో సందీప్ అతడి స్నేహితుడు జగడం సాయితో కసి మధ్యం సేవించాడు. రాత్రి 7గంటల సమయంలో గణేష్ టెంపుల్ సమీపంలో ఉన్న ఓ పాన్ షాప్ వద్ద సిగరేట్ తాగే విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ మొదలైంది. మిత్రుల మధ్య గొడవ చికి చికి పెద్దదిగా మారడంతో ఒకరి పై మరొకరు ముష్టిఘాతాలు కురిపించుకున్నారు. చిత్తుగా తాగిన మధ్యం మైకంలో స్నేహితుడని మరచి విచక్షణంగా సందీప్‌పై దాడి చేశాడు సాయి. దీనితో సందీప్ కిందపడిన ముఖం మీద సిమెంట్ బ్రిక్స్ ఎత్తేశాడు సాయి. తీవ్ర గాయాలు అయ్యి రక్తపు మడుగులో కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్న సందీప్‌ను స్థానికులు ఆటోలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరంచారు.
తీవ్రంగా గాయపడ్డ సందీప్ (23) మృతి చెందినట్లు డాక్టర్లు తెపారు. త్రి టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. మృతుడి అన్న హైదరాబాద్‌లో సాఫ్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. మంచి భవిషత్ ఉన్న సందీప్ చెడు వ్యసనాలకు అలవాటు పడి స్నేహితుడి చేతిలో హత్యకు గురవ్వడం కుటుంబంలో విషాదాన్ని నింపింది. వీధుల్లో విచ్చల విడిగా బెల్టు షాపులు వెలువడటంతో తప్ప తాగిన యువత మద్యం మత్తులో వీధుల్లో వీరంగం సృష్టిస్తున్నారని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. రాత్రి వేళల్లో ఇంటి నుండి బయటకు రావాంటే భయంగా ఉందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.