రక్షణ వీరుల రక్తదానం

అమరుల త్యాగాల స్పూర్తితో పనిస్తాం ఎస్పీ జి వినీత్
కొభద్రాద్రి : సమాజ రక్షణలో ప్రాణలు అర్పించే పోలీసులు సమాజీక సేవలోను ముందు వరుసలో నిలుస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. పోలీస్ అమరవీరుల త్యాగాల స్పూర్తితో ప్రజా రక్షణకు పాటుపడతామని జిల్లా ఎస్పీ జి వినీత్ అన్నారు.పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమాలలో భాగంగా అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ కొత్తగూడెం డిఎస్పీ వెంకటేశ్వర బాబు ఆధ్వర్యంలో శనివారం మెగా రక్తదాన శిబిరాన్ని కొత్తగూడెం పట్టణంలోని ఐఎంఎ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ జి వినీత్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమాజం, దేశం కోసం, రేపటి తరాల మంచి భవిష్యత్తు కోసం ప్రాణత్యాగాలు చేశారని వారి త్యాగాలను వెలకట్టలేమన్నారు. ప్రతీ ఒక్కరూ పోలీసు అమరవీరుల త్యాగాలను నిత్యం స్మరించుకోవాలన్నారు. పోలీస్ అమరుల త్యాగ ఫలితమే మనమంతా ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నామని అన్నారు. బాధితులకు సత్వర న్యాయం అందించడం, ధర్మం పక్షాన నిలిచి మెరుగైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా పని చేసినప్పుడే వారి త్యాగానికి మనమందించే ఘనమైన నివాళి అని తెలిపారు.థలసేమియా,క్యాన్సర్,హిమోఫీలియా, రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి,ఇతరత్రా జబ్బులతో బాధపడుతున్న వారి కోసం ఎక్కువగా రక్తం అవసరం ఉంటుందని,రక్తదానం చేసి అటువంటి వారి ప్రాణాలను కాపాడటం ద్వారా మనకు కూడా మంచి చేకూరుతుందని అని అన్నారు.రక్తదానం మహాదానమని,రక్తదానంపై అపోహలు వద్దని ఎస్పీ గారు అన్నారు. ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడేందుకు సేకరించిన రక్తం ఉపయోగపడుతుందని తెలియజేసారు.ఆరోగ్యంగా ఉండే ప్రతి మనిషి ప్రతీ 5 నెలలకొకసారి రక్తదానం చేయడం ద్వారా శరీరం మరింత ఉత్సాహవంతంగా మారుతుందని అన్నారు.ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన కొత్తగూడెం డిఎస్పీ వెంకటేశ్వర బాబు, సబ్ డివిజన్ పోలీస్ అధికారులను ఎస్పీ అభినందించారు.అదేవిధంగా రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చిన పోలీస్ అధికారులు,సిబ్బంది,యువత కు ప్రజలందరికీ కఅతజ్ఞతలు, తెలిపారు.డిఎస్పీ మాట్లాడుతూ ఈ రక్తదాన శిబిరం ద్వారా 130 యూనిట్ల రక్తాన్ని సేకరించడం జరిగిందని,ఈ కార్యక్రమంలో పాల్గని విజయవంతం చేసిన కొత్తగూడెం పట్టణ,పరిసర ప్రాంతాల ప్రజలకు కఅతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ డి శ్రీనివాసరావు, ఎస్బి ఇన్స్పెక్టర్ స్వామి,సిఐలు రమాకాంత్, సత్యనారాయణ, రాజు, అబ్బయ్య,వసంత్ కుమార్, ఆర్‌ఐలు దామోదర్,కామరాజు,ఎస్సైలలు,డాక్టర్ రవిబాబు సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.