తుది శ్వాసవరకు ప్రజా సేవలో

ఎమ్మెల్యే వనమా
కొత్తగూడెం : పని చేసే నాయకుడికి పదవులతో పని లేదని, ప్రజా నాయకుడిగానే తుది శ్వాస వీడేవరకు ప్రజా సేవలోనే తరిస్తానని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. నియోజక వర్గ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి అహర్నిశలు పాటుపడుతానని తెలిపారు. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ 27 లక్షలతో సిసి రోడ్లు, డ్రైన్‌ల నిర్మాణ పనులను ప్రారంభించారు. నియోజక వర్గంలోని మున్సిపాలిటీ పట్టణాలను అభివృద్ధి చేయడమే తన లక్ష్యం అన్నారు. వార్డుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేవరకు తాను నిద్రపోనని అధికారులను సైతం నిద్ర పోనివ్వనని అన్నారు. వార్డుల్లో అభివృద్ది పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ముందుగా అభివృద్ధి పనులను ప్రారంభించేందకు వచ్చిన ఎమ్మెల్యే వనమాకు కౌన్సిలర్ కూరపాటి విజయలక్ష్మి దంపతులు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం దళితబందు పథకం లబ్దిదారుల షాపులను ప్రారంభించారు. దళిత బందు పథకం ద్వారా ఆర్థిక సావలంభన దిశగా అడుగులు వేస్తున్నారని తెలిపారు. స్వశక్తితో సంపాదించుకుంటూ సమాజంలో గౌరవంగా జీవిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కాపు సీతాలక్ష్మి, వైస్ చైర్మన్ దాము, కౌన్సిలర్లుఎండి ఆఫజ్జల్ ఉన్నిసా బేగం, వానచర్ల విమల, పల్లపు లక్ష్మణ్, పరమేష్ యాదవ్, కో ఆప్షన్ సభ్యులు దూడల బుచ్చయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్యా రాంబాబు, సొసైటీ అధ్యక్షులు మండే హనుమంతురావు, గణేష్ టెంపుల్ చైర్మన్ తాటిపల్లి శంకర్ బాబు తదితరులు పాల్గన్నారు.