పేదల గుడిసెలు తొలగించొద్దు

కొత్తగూడెం : ఇళ్ళు లేని పేదందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని తెంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నవరపు కనకయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, తెంగాణ ఆదివాసీ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో వందలాది మంది పేదలు వెంకటేశ్వర కాలని నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం చుంచుప్ల తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పేదలు బ్రతుకు తెరువు కోసం వచ్చి జిల్లా కేంద్రంలో కిరాయి ఇంళ్ళలో నివసిస్తున్నారని, చుంచుప్ల మండం వెంకటేశ్వర కాలనీలోని సర్వే నెంబర్ 137లో పక్కా గృహాలు లేని పేదలు ఇంటి స్థం కోసం గత రెండు సంవత్సరాలుగా కరెంట్ వంటి కనీస మౌళిక వసతులు లేకపోయినా ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకొని అక్కడే నివాసం ఉంటున్నారని తెలిపారు. మానవతా దృక్పథంతో పేదలకు న్యాయం చేయాలని కోరారు. సీఐటీయూ జిల్లా నాయకులు లిక్కి బాలరాజు, భూక్యా రమేష్ లు మాట్లాడుతూ ఇంటి స్థలాలు ఇచ్చే వరకు పోరాటం ఆగదని చెప్పారు. పేదందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం నేటికీ హామీల అమలు చేయలేదని, పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం డిప్యూటీ తహశీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు, తహసీల్దార్ ప్రజలతో పోన్ ద్వారా మాట్లాడుతూ స్వయంగా తాను వచ్చి పరిశీస్తానని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రేపాకుల శ్రీనివాస్, తెంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు వజ్జ సురేష్, నాయకులు ఈసం నరసింహారావు, వీరభద్రం, రాంబాబు, బాలక్రిష్ణ, రామకఅష్ణ,నాగమణి,వసంత,నాగదుర్గ,వీరమ్మ, మోకాళ్ళ రమాదేవి, తదితరులు పాల్గన్నారు. అనంతరం డిప్యూటీ తహశీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు, తహసీల్దార్ ప్రజలతో పోన్ ద్వారా మాట్లాడారు, స్వయంగా తాను వచ్చి పరిశీస్తానని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రేపాకుల శ్రీనివాస్, తెంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు వజ్జసురేష్, నాయకులు ఈసం నరసింహారావు, వీరభద్రం, రాంబాబు, బాలక్రిష్ణ, రామకఅష్ణ, నాగమణి, వసంత, నాగదుర్గ, వీరమ్మ, మోకాళ్ళ రమాదేవి, తదితరులు పాల్గన్నారు.