చర్యలు ఏవి..?

రైతు మార్కెట్ స్థలం కబ్జాకు యత్నం బీఎస్పీ జోనల్ ఇంచార్జ్ యెర్రా కామేష్


కొత్తగూడెం : కొత్తగూడెం పట్టణం నడిబొడ్డున  రైతు మార్కెట్ లోని సుమారు రూ 12 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని జీవో  76ను అడ్డుపెట్టుకొని అక్రమంగా దరఖాస్తు చేసుకున్న వారిపై ఇంత వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని బహుజన్ సమాజ్ పార్టీ పార్లమెంట్ జోనల్ ఇంచార్జ్ యెర్రా కామేష్ ప్రభుత్వన్ని ప్రశ్నించారు. గురువారం కలెక్టర్ కార్యాలయ డిఆర్ఓ రవీంద్రనాథ్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు,మాజీ ప్రజప్రతినిధి కలిసి రైతు మార్కెట్ స్థలాన్ని,గాజులరాజం బస్తీ లోని ప్రభుత్వ స్థలాన్ని కాజేసెందుకు 25వ వార్డు కౌన్సిలర్ షాహీరా,ఆమె భర్త యూసుఫ్,11వ వార్డు మాజీ కౌన్సిలర్ మోరే భాస్కర్ రావు,అతని భార్య పార్వతి పేర్ల మీద రైతు మార్కెట్ స్థలానికి,33వ వార్డు కౌన్సిలర్ భర్త రావి రాంబాబు గాజులరాజం బస్తీలో 311 గజాల ప్రభుత్వ స్థలానికి అక్రమ పద్దతిలో తప్పుడు ధృవపత్రలు సృష్టించి ఇంటి పట్టాల కోసం దరఖాస్తులు చేసుకున్న సదరు వ్యక్తులపై,వారికి సహకరించిన వారిపై క్రిమనల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.జీవో నెంబర్ 76 ద్వారా ఇంటి పట్టాల కోసం చేసుకున్న దరఖాస్తుల వివరాలను రెవెన్యూ కార్యాలయంలో వార్డుల వారీగా నోటీస్ బోర్డులో పెట్టాలని కోరారు. ఈకార్యక్రమంలో చేనిగరపు నిరంజన్ కుమార్,అల్లకొండ శరత్,జెట్టి ఆనందరావు, వంశీ తదితరులు పాల్గొన్నారు.

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading