ప్రజా సేవకు అవకాశం ఇవ్వండి

పార్టీ కోసం మూడు తరాలుగా పనిచేస్తున్నాము
టి కాంగ్రెస్ ఇంఛార్జ్ కి  నాగా సీతారాములు వినతి

హైదరాబాద్ :  పార్టీ అభివృద్ధికి నిబద్ధతతో కష్టపడి పనిచేసే సామాన్య కార్యకర్తలకు కూడా సముచిత స్థానం ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని,  పార్టీ కోసం  అంకిత భావంతో పని చేస్తున్న తనకు ప్రజా క్షేత్రంలో నిలిచే అవకాశం ఇవ్వాలని టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు.తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షిని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ లో ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి తన బయోడేటాను అందించారు. ఈ సందర్భంగా నాగా సీతారాములు మాట్లాడుతూ గత 35 ఏళ్లుగా మా తాత, తండ్రి తర్వాత తరమైన నేను కాంగ్రెస్ పార్టీ కోసం  అహర్నిశలు పనిచేస్తున్నానని వివరించారు. విద్యావేత్తగా, రాజకీయ నాయకుడిగా నియోజకవర్గంలో పేరున్న తాను 2018 కొత్తగూడెం నియోజకవర్గ అసెంబ్లీ టికెట్ అవకాశం వచినప్పటికి రాజకీయ సమీకరణల వల్ల టికెట్ దక్కకపోయినా పార్టీ గెలుపుకు కృషి చేశానని గుర్తు చేశారు. అయితే కాంగ్రెస్ టికెట్ పై గెలిచిన ఎమ్మెల్యే టీఆర్ఎస్ లో చేరినట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నియోజకవర్గ ప్రజలకు అండగా నిలబడి పెద్దన్న పాత్ర పోషించానన్నారు. పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమం విజయవంతం చేయడంతో పాటు కరోనా కాలంలో తన ట్రస్ట్ తరపున అనేక సేవా కార్యక్రమాలు చేపట్టానని ఆమెకు వివరించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీతో పాటుగా, పలు ప్రయివేట్ సంస్థలు నిర్వహించిన సర్వేలలో కూడ బీసీ అభ్యర్థిగా తనకు ప్రాధ్యానం ఉన్నట్టు తెలిసిందన్నారు. కానీ జాతీయ స్థాయి పొత్తుల్లో భాగంగా కొత్తగూడెం సీటును సిపిఐ కు కేటాయించి తమకు త్వరలో సముచిత గౌరవం ఇస్తామని అధిష్టానం తెలిపిందని, పార్టీ మాటకు విలువ ఇచ్చి పొత్తు ధర్మం పాటించి కాంగ్రెస్ బలపరిచిన సిపిఐ అభ్యర్థి గెలుపు కోసం తీవ్రంగా శ్రమించామని ఆయనకు వచ్చిన మెజారిటీ యే దానికి నిదర్శనమన్నారు. సీతారాములు పార్టీ కోసం కష్టపడ్డ తీరును అభినందించిన తెలంగాణ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మంచి స్థానం కల్పిస్తామన్నారు.

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading