పాత పెన్షన్ పద్ధతిని అమలు చేయాలి

రెండు రోజులపాటు రిలే నిరాహార దీక్షలు
కొత్తగూడెం : కొత్తగూడెం పట్టణం రైల్వే స్టేషన్ ఎదురుగా ఎస్సిఆర్ఎంయూ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అములు చేస్తున్న కొత్త పెన్షన్ విధానం రద్దు చేయాలని రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కొత్త పెన్షన్ విధానం వలన రైల్వే కార్మికులు వారికి రావలసిన రాయితీలను కోల్పోతున్నారన్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ డివిజన్ అడిషనల్ సెక్రటరీ ఎస్ కె ఖాజా బాబా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికుల పట్ల నిర్లక్ష్య ధోరణి వహిస్తుందన్నారు. భారతదేశ రవాణా వ్యవ స్థలో రైల్వేది కీలక పాత్ర, అనునిత్యం దేశ ఆర్ధిక వ్యవస్థకు ఎంతగానో దోహదపడుతున్న రైల్వే కార్మిక వర్గానికి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందన్నారు. అనేక కార్మిక చట్టాల అమలులోను జాప్యం వహించిందన్నారు. కార్మికులు కొత్త పెన్షన్ విధానం వలన ఆర్థి కంగా నష్టపోతున్నారని చెప్పారు. దీనిలో భాగంగా సౌత్ సెంట్రల్ రైల్వే మజ్జూర్ యూని యన్ ఆధ్వర్యంలో రెండు రోజుల రిలే నిరాహార దీక్షలు ప్రారంభించమని చెప్పారు. రెండు రోజుల రిలే నిరాహార దీక్షకు ఎమ్మెల్యే కూనంనేని, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె షబ్బీర్ పాషా సంఘీ భావం తెలిపారు. చివరగా కార్మికులకు నిమ్మ రసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం రోడ్ రైల్వే కార్మిక నాయకులు కొలా వెంకటేశ్వర్లు, ఐస్వారి పుల్లయ్య, ఓం కుమార్, పవన్, రామారావు, రవిరాజ్, నవీన్, రవితేజ, నాగరాజు, వై గోపా లరావు, లక్ష్మణ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.