సింగరేణిని కాపాడేది కాంగ్రెస్

ఐఎన్టీయూసీతోనే కార్మికుల సంకేమం
రూ 20 లక్షల వడ్డీ లేని రుణం, 250 గజాల ఇళ్ల స్థలం
మంత్రి పొంగులేటి

సింగరేణి :  సింగరేణి సంస్థను ప్రైవేటీకరణకు చేపట్టే చర్యలను కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, 250 గజాల ఇళ్ల స్థలము, రూ 20 లక్షల వడ్డీ లేని రుణాలు అందజేస్తామని,  డిపెండెంట్ నియామకాలలో దళారీ వ్యవస్థను అరికడతామని రెవెన్యూ శాఖా మండ్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సింగరేణి కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం ఏరియా, కార్పొరేట్ ఏరియాలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ  డిపెండెంట్ నియామకాల్లో గత పాలకులు దళారులకు కొమ్ము కాసిందని విమర్శించారు. గతంలో   టిబిజికెఎస్ సంఘాన్ని గెలిపించుకున్నామాని, కానీ కేసీఆర్ నిరంకుశత్వంతో  సమస్యలపై కార్మికుల పక్షాన ప్రభుత్వంతో మాట్లాడే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బిఆరెస్ ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలు  ఒక్కటి కూడా అమలు చేయలేదని విమర్శించారు.

కార్మికుల పేరు మార్పిడిలో  గత పాలకులు విఫలం చెందారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో కచ్చితంగా సాధించుకుందామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వంలో కారుణ్య నియామకాలలో దళారులకు 10 లక్షల వరకు వసూళ్ళ పాల్పడిన దుస్థితి ఉండేది అన్నారు. నేడు ఎవరికి ఒక్క రూపాయి చెల్లించవలసిన అవసరం లేదన్నారు. దళారి వ్యవస్థను అరికడతామన్నారు. విద్యా, వైద్యం కోసం సింగరేణి సంస్థతోపాటు ప్రభుత్వం అన్ని విధాలుగా కార్మికుల పక్షాన నిలుస్తుందన్నారు. ఇనకంమ్ టాక్స్, అలవెన్స్ వాటిపై విధించే వడ్డీలను యాజమాన్యమే చెల్లించేలా చర్యలు తీసుకుంటామని ఆన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టాలని కోరారు. కేంద్రంలో సింగరేణి సంస్థ పరిరక్షణకుఅవసరమైన విధి, విధానాలను కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందిస్తోంది అన్నారు.

సింగరేణి డే డిసెంబర్ 23 ను సెలవును దినంగా ప్రకటిస్తామన్నారు. సింగరేణి సంస్థలో 60 వేల కార్మికులు ఉండేవారని, బిఆర్ఎస్ పాలన వచ్చాక ఆ సంఖ్య నేడు 39,250 చేరిందన్నారు. సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని, ఉద్యోగులకు ఒకటో తేదీ నుంచి 5లోపు  జీతాలు చెల్లిస్తామన్నారు. రాష్ట్రంలో కొత్త భూగర్భ గానులను త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. విద్యావంతులైన కార్మికులకు తమకు అర్హత ఉన్న ఉద్యోగాలు, మహిళా కార్మికులకు అనువైన ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ  కార్మిక అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కార్మికులను అభ్యర్థించారు. వివిధ కార్మిక సంఘాల నుండి వచ్చిన కార్మికులకు ఐఎన్టీయూసీ సంఘం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే ఇల్లందులో పర్యటించిన సందర్భంగా ఇల్లందు సింగరేణి ఏరియా జిఎం జాన్ ఆనంద్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతోపాటు ఎమ్మెల్యే కోరం కనకయ్య సైతం జిఎం కి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading