టిబిజికెఎస్ కు కార్మికుల మద్దతుంది
20 వేల కార్మిక కుటుంబాలకు లబ్ది

సింగరేణి : కార్మికుల డిపెండెంట్ ఉద్యోగాల పునరుద్ధరణ కెసిఆర్ ఘనతే. స్వార్ధ పూరిత రాజకీయ లబ్ది కోసమే టిబిజికె ఎస్ ను వీడి ఐఎన్ టియూసిలో చేరారు. కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి కార్మికులు ఆత్మ సాక్షిగా ఓటేస్తారని నమ్మకం ఉందన్నారు. సింగరేణి సంస్థ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం టిబిజికెఎస్ తోనే సాధ్యం అన్నారు. ప్రలోభాలకు లొంగకుండా కార్మికులు టిబిజి కె ఎస్ కు పూర్తి మద్దతుగా నిలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బండి నర్సింహారావు, వేముల ప్రసాద్, రుక్మాంగధర్ బండారి, అంబుల వేణుగోపాల్, కౌడగాని పరమేష్, పాలోజు సత్యనారాయణచారి, అజ్మీరా పూర్ణ, పిడుగు శ్రీను, కోస్తున వాసు, ఎంఎ రజాక్, కూరపాటి సుధాకర్, మహ్మద్ యూసుఫ్, మాదా శ్రీరాములు, విజయ్ కుమార్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.