కొత్తగూడెం : తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క సతీమణి, అమ్మ ఫౌండేషన్ ఛైర్మెన్ నందిని విక్రమార్క మల్లుకు యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ మొహమ్మద్ దావుద్ ఘనంగా స్వాగతం పలికారు. ముక్కోటి సందర్భంగా దైవదర్శనానికి భద్రాచలం బయల్దేరారు. మార్గం మధ్యలో కొత్తగూడెం చేరుకోగానే మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్ప గుచ్చెము అందజేశారు. డిప్యూటీ సీఎం గెలుపులో కీలక పాత్ర పోషించిన మల్లు నందినికి హార్ధిక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ బస్తి యూత్ ఎండి ముంతాజ్ అలీ, ఎండి జాఫర్ పాషా, ఎస్డి నదీమ్, సిహెచ్ రవి, భాగ్యరాజ్, కార్తీక్, వినయ్, శ్రీనివాస్, కిరణ్, నౌషాద్, ఎండి అప్రోచ్, మైస జీవన్ తదితరులు పాల్గొన్నారు.