యూనిట్ పెన్షనర్స్ దినోత్సవ వేడుకలు

పెన్షనర్లు రుణ సదుపాయాన్ని పొందొచ్చు

కొత్తగూడెం :  తెలంగాణ రాష్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో  కొత్తగూడెం హెడ్ క్వార్టర్స్ యూనిట్ పెన్షనర్ భవన్ లో పెన్షనర్స్ దినోత్సవ వేడుకలను  ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  విశ్రాంత ఉద్యోగులకు బ్యాంకు ద్వారా లభించే పథకాలను ఎస్ బిఐ పోస్టాఫీస్ ఏరియా బ్రాంచ్ మేనేజర్ శరత్ వివరించారు. పెన్షనర్లకు రుణ సదుపాయాలను తెలియజెశారు. ఎస్ దయాకర్ ఇన్సూరెన్స్ ట్రైనర్ ఇన్సూరెన్స్ పాలసీలు, డిపాజిట్ పై ఉన్న పెన్షన్ పథకాలపై వివరించారు. జిల్లా అధ్యక్షులు ఇజిఆర్ వెస్లీ విశ్రాంత ఉద్యోగుల సమస్యలు ఎలా పరిష్కరించాలో సూచించారు. యూనిట్ అధ్యక్షులు ఎల్ రాములు  లైఫ్ సర్టిఫికెట్ సమర్పించట, జనరల్ ఫండ్ సేకరించుడం, ఫండ్స్ తో సంఘంలో నిర్వహించే కార్యక్రమాలను వెల్లడించారు. 6 గురు పేద మహిళలకు చీరలు , బియ్యం, పండ్లు పంపిణి చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకటేశ్వర్ రావు మాట్లాడుతూ మంచి ఆరోగ్యంతో జీవించే అవకాశము ఉందన్నారు. ఈ కార్యక్రమాలు నిర్వహించడం వాళ్ళ లైఫ్ స్పాన్ పెరుగుతుందన్నారు. అనంతరం 70ఏళ్ళు పైబడిన పది మంది సీనియర్ పెన్షనర్లను, సూపర్ సీనియర్ పెన్షనర్ ఎన్ సుబ్బారావును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో షుమారు యూనిట్ సెక్రటరీ ఐ ఎం భాస్కర్ తో పాటు150 మంది పాల్గొన్నారు.

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading