జల్సా చేద్దామనుకుంటే జైలు పాలయ్యారు

గంజాయి అక్రమ రవాణా కేసులో ముగ్గురికి పన్నెండేళ్ళ జైలు శిక్ష ఖరారు చేస్తూ కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా, సెషన్స్‌ జడ్జ్‌ (స్పెషల్‌ జడ్జ్‌ ఎన్‌ డి పి ఎస్‌ యాక్ట్‌ ) ఎం శ్యాం శ్రీ తీర్పు చెప్పారు. 2022 జూలై 26న భద్రాచలం టౌన్‌ సబ్‌ ఇన్స్పెక్టర్‌ బి మహేష్‌ తమ సిబ్బందితో ఫారెస్ట్‌ చెక్‌ పోస్ట్‌ వద్ద వాహన తనిఖీ నిర్వహించారు. హైదరబాద్‌ పాత హఫీజ్‌ పేటకు చెందిన బర్ల శ్రీకాంత్‌, ఈర్ల అనిరుద్‌,తవుట వినయ్‌లు నెం టిఎస్‌ 10, 6667 సిల్వర్‌ కలర్‌ ఇన్నోవా కారులో రెండు క్వింటాల గంజాయి 10ప్యాకెట్లలో అక్రమంగా తలిస్తుట్లు పోలీసులు గుర్తించారు.

గంజాయి కేసులో ముగ్గురికి పన్నెండేళ్ళ కఠిన శిక్ష

కొత్తగూడెం : గంజాయి అక్రమ రవాణా కేసులో ముగ్గురికి పన్నెండేళ్ళ జైలు శిక్ష ఖరారు చేస్తూ కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా, సెషన్స్‌ జడ్జ్‌ (స్పెషల్‌ జడ్జ్‌ ఎన్‌ డి పి ఎస్‌ యాక్ట్‌ ) ఎం శ్యాం శ్రీ తీర్పు చెప్పారు. 2022 జూలై 26న భద్రాచలం టౌన్‌ సబ్‌ ఇన్స్పెక్టర్‌ బి మహేష్‌ తమ సిబ్బందితో ఫారెస్ట్‌ చెక్‌ పోస్ట్‌ వద్ద వాహన తనిఖీ నిర్వహించారు. హైదరబాద్‌ పాత హఫీజ్‌ పేటకు చెందిన బర్ల శ్రీకాంత్‌, ఈర్ల అనిరుద్‌,తవుట వినయ్‌లు నెం టిఎస్‌ 10, 6667 సిల్వర్‌ కలర్‌ ఇన్నోవా కారులో రెండు క్వింటాల గంజాయి 10ప్యాకెట్లలో అక్రమంగా తలిస్తుట్లు పోలీసులు గుర్తించారు. గంజాయి ప్యాకెట్లను సీజ్‌ చేసి అప్పటి భద్రాచలం టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌ కె వినోద్‌కు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా ఒరిస్సా రాష్ట్రం మల్కాజ్గిరి జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తుల నుండి తక్కువ ధరకు కొని అమ్మి అధిక లాభాలు పంచుకునేందుకు అక్రమంగా తలలిస్తున్నట్లు విచారణలో నేరము ఒప్పు కున్నారని, పంచనామా ద్వారా అప్పటి సర్విల్‌ ఇన్స్పెక్టర్‌ టి స్వామి దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు . ఏడుగురు సాక్షులను విచారించిన కోర్టు ముగ్గురికి 12 ఏళ్ళ కఠిన గారగార శిక్ష, రూ లక్ష జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రావి విజయకుమార్‌, ప్రాసిక్యూషన్‌ నిర్వహించారు.,లైజాన్‌ ఆఫీసర్‌ ఎం హరి గోపాల్‌, భద్రాచలం కోర్టు డ్యూటీ ఏఎస్‌ఐ గంజి శశిధర్‌లు సహకరించారు.

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading