ఎఐటియూసి నామినేషన్ దాఖలు
సింగరేణిలో ఈనెల 28న జరిగే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎఐటియూసి అనుబంధ కార్మికసంఘం సింగరేణి వర్కర్స్ యూనియన్ నామినేషన్ దాఖలు చేసింది. హైదరాబాద్‌లోని డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య నేతృత్వంలో అందజేశారు. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి ఆరు ఏళ్ళు గడిచినా యాజమాన్యం పట్టించుకోడం లేదని విమర్శించారు.

సింగరేణి : సింగరేణిలో ఈనెల 28న జరిగే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎఐటియూసి అనుబంధ కార్మికసంఘం సింగరేణి వర్కర్స్ యూనియన్ నామినేషన్ దాఖలు చేసింది. హైదరాబాద్‌లోని డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య నేతృత్వంలో అందజేశారు. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి ఆరు ఏళ్ళు గడిచినా యాజమాన్యం పట్టించుకోడం లేదని విమర్శించారు. ఎన్నికల నిర్వహణకు హైకోర్టుకు ఆశ్రయించినట్లు తెలిపారు. కోర్టు మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని ఫిబ్రవరిలో తీర్పు ఇచ్చినా యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు సంఘం ఎన్నికలు జరుపకుండా కుంటిసాకులు చెప్పి వాయిదా వేసే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. కార్మిక శాఖ పై ఒత్తిడి తేవాల్సిన పరిస్థిని నెలకొందన్నారు. కేంద్ర కార్మిక శాఖా పలు సార్లు అన్ని కార్మిక సంఘాలతో చర్చలు జరిపితే 14కార్మిక సంఘాలు ఎన్నికలు నిర్వహించాలని డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్‌కు రాతపూర్వకంగా విజ్ఞప్తి చేశాయన్నారు. దీని ఆధారంగానే డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ సెప్టెంబర్ 27న ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారని పేర్కొన్నారు. ఈ సమయంలో యాజమాన్యం సింగరేణి భవన్‌లో 12 కార్మిక సంఘాలను మభ్యపెట్టి హాజరు హాజరు కాకుండా చేసిందన్నారు. ఎన్నికలు జరుపకుండా కుట్రకు పాల్పడ్డారని ఆరోపించారు. కార్మికుల శ్రేయస్సు, సంస్థ రక్షణ కోసం ఎన్నికలు నిర్వహించాలని కోర్టులో న్యాయ పోరాటం చేస్తుందన్నారు. ఎఐటియూసి, బిఎంఎస్‌తో పాటు మరికొన్ని కార్మిక సంఘాలు నామినేషన్ దాఖలు చేశాయన్నారు. గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగేలా కార్మిక శాఖకు సహాకరించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూసఫ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు, రాష్ట్ర నాయకులు విఎస్ బోసు, వంగ వెంకట్, అళవందార్ వేణు మాధవ్, సోమయ్య పాల్గొన్నారు.