బోయింగ్ 737 మాక్స్ 9 ముఖేష్ అంబానీ కొనుగోలు
- జెట్ విలువ అక్షరాల రూ 1000 కోట్లు
- ఒకేసారి 6,355 నాటికల్ మైళ్ళు ప్రయాణం
హైదరాబాద్ : బిజినెస్ దిగ్గజం రిలయన్స్ ఇండస్టీస్ అధినేత ముఖేష్ అంబానీ భారతదేశపు మొట్ట మొదటి బోయింగ్ 737 మాక్స్ 9ను కొనుగోలు చేశాడు. దీని ఖరీదు ఎంతో తెలిస్తే షాక్‌కు గురవ్వక తప్పదు. ఈ జెట్ విలువ అక్షరాల రూ 1000 కోట్లు. విస్తృతమైన విమాన పరీక్షల తరువాత బోయింగ్ 737 మాక్స్ 9 ఇటీవల భారతదేశానికి వచ్చింది. కొత్త జెట్‌తో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ వద్ద మరో తొమ్మిది ప్రైవేట్ జెట్లు ఉన్నాయి. ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ నిలిచారు. విస్తారమైన సంపదతో విలాసవంతమైన జీవనశైలికి కేంద్ర బింధువుగా మారాడు అతను. అద్భుతమైన ప్రైవేట్ జెట్లు, హెలికాప్టర్ల సేకరణ చేపడుతుంటాడు. విలాసవంతమైన విమానాలతో పాటు అంబానీ చివరకు భారతదేశపు మొట్టమొదటి బోయింగ్ 737 మాక్స్ 9 డెలివరీని తీసుకున్నారు. ఈ అల్ట్రా-లాంగ్-రేంజ్ బిజినెస్ జెట్ ఇప్పుడు భారతీయ వ్యాపారవేత్త యాజమాన్యంలోని అత్యంత ఖరీదైన ప్రైవేట్ జెట్ ఇది. కార్టోక్ నివేదిక ప్రకారం ముఖేష్ అంబానీ బోయింగ్ 737 మాక్స్ 9 స్విట్జర్లాండ్‌లోని యూరోఎయిర్పోర్ట్ బాసెల్-ముల్హౌస్-ఫ్రీబర్గ్ (బిఎస్‌ఎల్)లో క్యాబిన్, ఇంటీరియర్ డిజైన్‌లో గణనీయమైన మార్పు అనంతరం ఢల్లీికి చేరుకుంది.
2023 ఏప్రిల్ 13నుండి సౌకర్యార్థం విమానం స్విస్‌లో ఉంచారు. అన్ని నవీకరణలు సరిగ్గా పనిచేస్తున్నాయని ధృవీకరించడానికి వరుస పరీక్షలు నిర్వహించారు. భారత్‌లో అడుగు పెట్టే ముందే ఈ ప్రైవేట్ జెట్ బాసెల్, జెనీవా, లండన్, లుటన్ విమానాశ్రయాలలో ఆరు పరీక్షలు పూర్తి చేసుకుంది. చివరగా ఆగష్టు 27న బోయింగ్ 737 మాక్స్ 9 విమానం బాసెల్ నుండి ఢల్లీికి చేరుకుంది. తొమ్మిది గంటలకు పైగా 6,234 కిలోమీటర్లు ప్రయాణించింది. విమానం రాకతో దేశంలోనే అత్యంత ప్రత్యేకమైన, ఖరీదైన ప్రైవేట్ జెట్లలో ఒకటిగా నిలిచింది. అంబానీ కొత్త విమానం ప్రస్తుతం ఢల్లీి విమానాశ్రయంలోని కార్గో టెర్మినల్ సమీపంలో మెయింటెనెన్స్ ఆప్రాన్‌లో పార్క్ చేయబడిరది.
మీడియా నివేదికల ప్రకారం ఈ జెట్ త్వరలో ముంబైలోని రిలయన్స్ ప్రధాన కార్యాలయం చేరుకుంటుంది. స్పెసిఫికేషన్ల గురించి మాట్లాడుతూ బోయింగ్ 737 మాక్స్ 9 ప్రపంచంలోని అత్యంత ఖరీదైన జెట్లలో ఒకటి. రెండు సిఎఫ్‌ఎంఐ ఎల్‌ఈఎపి -18 ఇంజిన్లతో పనిచేస్తుంది. ఈ విమానం 8401 ఎంఎస్‌ఎన్ సంఖ్యను కలిగి ఉంటుంది. ఒకేసారి విమానం 6,355 నాటికల్ మైళ్ళు (11,770 కిలోమీటర్లు) ప్రయాణించగలదు.బోయింగ్ 737 మాక్స్ 9 బేస్ ధర 118.5 మిలియన్ డాలర్లు. క్యాబిన్ రెట్రోఫిటింగ్, ఇంటీరియర్ మార్పుల ఖర్చులు లేవు. అదనంగా ఈ జెట్ బోయింగ్ మాక్స్ 8 తో పోలిస్తే పెద్ద క్యాబిన్, కార్గో స్థలాన్ని కలిగి ఉంటుంది. అయితే ఈ అల్ట్రా-లాంగ్-రేంజ్ బిజినెస్ జెట్ కోసం అంబానీ కుటుంబం రూ 1000 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు అనేక మీడియా నివేదికలు సూచిస్తున్నాయి.అంతే కాకుండా రిలయన్స్ ఇండస్ట్రీస్ బొంబార్డియర్ గ్లోబల్ 6000, రెండు డసాల్ట్ ఫాల్కన్ 900లు ఒక ఎంబ్రేర్ ఇఆర్‌జె-135 విమానాలను కూడా కలిగి ఉంది.