35శాతం లాభాల వాటా చెల్లించాలి
- సర్ఫేస్ కౌన్సిలింగ్ నిర్వహించాలి
- ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఆంజనేయులు డిమండ్

కొత్తగూడెం : సింగరేణి సంస్థ లాభాల వాటాలో 35 శాతం కార్మికులకు చెల్లించాలని, ఏరియాలోని వివిధ డెసిగ్నేషన్ల ఖాళీలను భర్తీ కొరకు సర్ఫేస్ కౌన్సిలింగ్‌ను ఏర్పాటు చేయాలని హెచ్‌ఎంఎస్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఆంజనేయులు డిమండ్ చేశారు. హెచ్‌ఎంఎస్ ఆధ్వర్యంలో సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని పివికె 5 నందు గేట్ మీటింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మైన్‌లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు త్వరితగతిన పరిష్కరించి పని భారాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని మేనేజ్మెంట్‌ను కోరినట్లు స్పష్టం చేశారు. కార్మికుల అభిప్రాయాలు స్వీకరించకుండానే ఒక రోజు వేతనం కట్ చేయడం చట్ట విరుద్ధం అన్నారు. ఈ నష్టాన్ని బర్తి చేసేందుకు యాజమాన్యం పేడే కల్పించి నష్టాన్ని నివారించాలి అన్నారు.సేఫ్టీకి సంబంధించిన పలు విషయాలపై, యాక్టింగ్‌ల ఆధారంగా అన్ని రకాల డిజిగ్నేషన్లకు ప్రమోషన్లు కల్పించాలని కోరారు.
లాభాల వాటాలో 35 శాతానికి తగ్గకుండా చెల్లించేలా హెచ్‌ఎంఎస్ పోరాటం చేస్తుందన్నారు. మాయమాటలతో ఓట్లు దండుకున్న మిగతా సంఘాల వైఖరిని ఎండకట్టారు. లాభాల వాట, దీపావళి బోనస్ గురించి కార్మికులందరూ మిగతా సంఘాల మీద ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణ ప్రసాద్, బ్రాంచ్ సెక్రెటరీ ఆసిఫ్, సీఎస్పీ పిట్ సెక్రెటరీ పూర్ణచందర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ యాకూబ్, పిట్ సెక్రెటరీ షకీల్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.