బిఆర్‌ఎస్‌ బిజెపి బి టీమ్‌

ఎన్నికలు సమీపిస్తున్న వేళ బిఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు మల్లీ ఐదేళ్ళ పాటు దోచుకునేందుకు డబ్బు మూటలతో బయల్దేరారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రచార కమిటీ కో చైర్మన్‌ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బిఆర్‌ఎస్‌ బిజెపి బిటీమ్‌ అని ప్రధాని తెలంగాణ పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలతో తేలిపోయిందన్నారు. లిక్కర్‌ దందాలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తన కూతురిని కాపాడుకునేందుకు కెసిఆర్‌ బిజెపితో చేతులు కలిపారని ఆరోపించారు. కొత్తగూడెం నియోజకవర్గంలోని కొత్తగూడెం పట్టణం, చుంచుపల్లి పాల్లంచ మండలాలో పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. పొంగులేటి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్ష నిధులు, నీళ్ళు, నియామకాలకోసం అన్ని వర్గాల ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణలో కేవలం ఒక్క కెసిఆర్‌ కుటుంబానికికే పరిమితమయ్యాయని విమర్శించారు.


మల్లీ దోచుకోడానికి డబ్బు మూటలతో వస్తున్నారు
అధికారం చేపట్టగానే గ్యారంటీలు అమలు : పొంగులేటి
భద్రాద్రి :
ఎన్నికలు సమీపిస్తున్న వేళ బిఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు మల్లీ ఐదేళ్ళ పాటు దోచుకునేందుకు డబ్బు మూటలతో బయల్దేరారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రచార కమిటీ కో చైర్మన్‌ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బిఆర్‌ఎస్‌ బిజెపి బిటీమ్‌ అని ప్రధాని తెలంగాణ పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలతో తేలిపోయిందన్నారు. లిక్కర్‌ దందాలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తన కూతురిని కాపాడుకునేందుకు కెసిఆర్‌ బిజెపితో చేతులు కలిపారని ఆరోపించారు. కొత్తగూడెం నియోజకవర్గంలోని కొత్తగూడెం పట్టణం, చుంచుపల్లి పాల్లంచ మండలాలో పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. పొంగులేటి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్ష నిధులు, నీళ్ళు, నియామకాలకోసం అన్ని వర్గాల ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణలో కేవలం ఒక్క కెసిఆర్‌ కుటుంబానికికే పరిమితమయ్యాయని విమర్శించారు. నిధులను నీళ్ళలా దోచుకున్న డబ్బుతో ఓట్లు కొనేందుకు మీవద్దకు బిఆర్‌ఎస్‌ నాయకులు వస్తున్నారని, డబ్బులు ఇస్తే తీసుకోండి కానీ తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ కాంగ్రెస్‌ పార్టీని ఓటు వేయాలని కోరారు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను గుర్తించి ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మ కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి కానుకగా ఇవ్వాలన్నారు. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో చందాలు, దందాలు, అవినీతి, అక్రమాలే రాజ్యమేలుతున్నాయని ఆగ్రహించారు. రాబోయే ఇందిరమ్మ రాజ్యంలో అవినీతికి ఏ మాత్రం ఆస్కారం ఉండదని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అధికారం చేపట్టగానే ఆరు హామీలను పక్కాగా అమలు చేస్తామాన్నరు. గతంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నపుడు మైనార్టీలకు ఇచ్చిన హామీలను అమలుచేసిందని గుర్తు చేశారు. బిజెపికి బిఆర్‌ఎస్‌ బి టీమ్‌ అనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. మహిళలకు, నిరుద్యోగులకు, వఅద్దులకు, రైతులకు ఇంకా అనేక వర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని తెలిపారు. కొత్తగూడెం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరుపున పోటీ చేసే అభ్యర్థిని అత్యధిక మెజారిటితో గెలిపించాలని కోరారు. అనంతరం ఆయా ప్రాంతాల్లో పర్యటించి పలు కుటుంబాలను పరామర్శించి ఆర్థికసాయాలను అందచేశారు. అదేవిధంగా క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన ఓ విద్యార్థినిని అభినందించారు. ముందుగా చుంచుపల్లి తండాలో ఆ ప్రాంత నాయకులు హేమ్ల, కిషాన్‌, మురళి, చిన్నా, రాందాస్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కుటుంబాలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గంగా హుసేన్‌ బస్తీ ఐదవ వార్డులో ఖమర్‌, వెంకన్న ఆధ్వర్యంలో యూత్‌ నాయకులు పలువురు కాంగ్రెస్‌ పార్టీలోకి చేరారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హజరైన పొంగులేటి వారికి . అనంతరం నిర్వాహకులు పొంగులేటిని గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ రాష్ట్ర నాయకులు ఊకంటి గోపాలరావు, నాగ సీతారాములు, తూము చౌదరి, ఆళ్ల మురళి, నాగేంద్ర త్రివేది, పెద్ద బాబు, కనకరాజు, ఆయూబ్‌ ఖాన్‌, శివా రెడ్డి, దేవరగట్ల ప్రసాద్‌, గౌస్‌ పాషా, నాగేందర్‌, సతీష్‌ , పండు, నరేష్‌, నాగేశ్వరరావు, ఆవుల మధు తదితరులు పాల్గొన్నారు.

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading