ఈత కొట్టాడు రజితం పట్టాడు

కొత్తగూడెం : రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం త్రీ ఇంక్లైన్‌కు చెందిన రెడ్డిరాజుల సాయిధనుష్ ప్రతిభ చాటాడు. హైదరాబాద్ స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గచ్చిబౌలీలో నిర్వహించిన రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ అండర్ 19 విభాగంలో సోయి ధనుష్ రజతపతకం సాధించాడు. ఈపోటీలో రాణించి సత్తా చాటిన క్రీడాకారుడిని జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి జి హనుమంతరాజు, స్విమ్మింగ్ కోచ్ సామ్యూల్, ఇతర క్రీడాకారులు అభినందించారు.