దేశ ప్రగతిలో బొగ్గు రంగానిదే కీలక పాత్ర

పర్యావరణహిత మైనింగ్‌ పైనే దృష్టి
1.5 మి.టి ఉత్పత్తి లక్ష్యం డైరెక్టర్‌ (పా)


సింగరేణి :
దేశం ప్రగతి పథంలో పయనిస్తున్న నేపథ్యంలో బొగ్గు ఇంధన వాడకం విస్తృతంగా పెరుగుతుందని 2030 నాటికి 1.5 మిలియన్‌ టన్నుల బొగ్గు అవసరం ఉంటుందని తెలిపారు. మారిన పర్యావరణ చట్టాల నేపథ్యంలో ప్రకృతికి, ప్రజలకు హాని లేకుండా బొగ్గు ఉత్పత్తి చేయాల్సిన బాధ్యత మైనింగ్‌ సంస్థలపై ఉందని డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ అన్నారు. కొత్తగూడెంలో తొలిసారిగా మైనింగ్‌ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా సింగరేణి చాప్టర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి సదస్సులో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మైనింగ్‌ రంగ సుస్థిరాభివృద్ధికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం అనే అంశంపై నిర్వహించిన సదస్సులో డైరెక్టర్‌ పా మాట్లాడుతూ నేటికీ మైనింగ్‌ ప్రక్రియ భూమి పొరలను పేల్చడం ద్వారా బొగ్గు వెలికితీస్తున్నారని, దీనివల్ల పర్యావరణానికి, ప్రజలకు కలిగే నష్టాన్ని నివారించే చర్యలు చేపడుతున్నా పూర్తి స్థాయిలో నివారించలేక పోతున్నామని అన్నారు. పర్యావరణహిత మైనింగ్‌ కోసం అవసరమైన ఆధునాతన సాంకేతికతను రూపొందించి అమలు చేయాలి పిలుపునిచ్చారు. ఆధునిక టెక్నాలజీ రూపకర్తలు మైనింగ్‌ ఇంజినీర్ల అసోసియేషన్‌ సమన్వయంతో నూతన సాంకేతికతను అభివఅద్ధి చేయాలన్నారు. మైనింగ్‌ కళాశాలలు, మానవ వనరుల స్వయం సమంవృద్ధి పరిశ్రమలతో పాటు మైనింగ్‌ ఇంజినీర్ల అసోసియేషన్లు కూడా శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి, కొత్తవారిని పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా తీర్చి దిద్దాలన్నారు. డైరెక్టర్‌ (ఈ అండ్‌ ఎం) డి సత్యనారాయణ రావు మాట్లాడుతూ సింగరేణి సంస్థ అత్యాధునిక పర్యావరణ హిత మైనింగ్‌ టెక్నాలజీలను మొదటి నుంచీ అమలు జరుపుతోందని వివరిస్తూ రానున్న కాలంలో ఉపరితల బొగ్గు భూగర్భ గనుల ప్రాధాన్యత పెరిగినా బ్లాస్టింగ్‌ ప్రక్రియలు లేని పర్యావరణ హిత మైనింగ్‌ ద్వారా బొగ్గు ఉత్పత్తి జరగాల్సి ఉంటుందన్నారు. ఏ కొత్త ఆవిష్కరణ అయినా ప్రకృతి, మానవాళికి మేలు చేసేదిగా ఉండాలని సూచించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన మైనింగ్‌ ఇంజినీర్స్‌ అసోయేషన్‌ అధ్యక్షులు మధుసూదన్‌ మాట్లాడుతూ.. తొలిసారిగా ఇటువంటి జాతీయ సదస్సును మైనింగ్‌ ప్రాంతంలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. దీనికి సహకరించిన సింగరేణి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశానికి కన్వీనర్‌, జీఎం(సీపీపీ) సీహెచ్‌ నర్సింహారావు స్వాగతం పలకగా కో కన్వీనర్‌ ఎఎల్‌ఎస్‌వి. సునీల్‌ వర్మ వందన సమర్పణ చేశారు. ఈ సమావేశంలో ఎల్‌అండ్‌టీ, కొమట్స్‌, ఉత్కల్‌, నోవా వంటి తయారీ సంస్థలతోపాటు పలు బొగ్గు పరిశ్రమల ప్రతినిధులు, రిలయన్స్‌, హెచ్పీసీఎల్‌, ఎన్సీసీ తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading