పైరవీల దందాకు చెక్ పెట్టాలి !

  • పారదర్శకంగా సర్ఫేస్ ఖాళీల భర్తీ చేపట్టాలి
  • సర్కులర్ ప్రకారం ఆఫీస్ ఆర్డర్స్ ఇవ్వాలి
  • పర్మినెంట్ కౌన్సిలింగ్ నిర్వహించాలి
  • హెచ్ఎంఎస్ డిమాండ్ 

కోల్ బెల్ట్ : సింగరేణి సంస్థ కార్మిక శక్తితో నడుస్తుందని, నాయకులతో కాదని, అధికారులు నాయకుల అడుగులకు మడుగు ఒత్తడం మాని కార్మికుల సంక్షేమానికి పాటు పడాలని హెచ్ఎంఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గడిపల్లి కృష్ణ ప్రసాద్ డిమాండ్ చేశారు. హెచ్ఎంఎస్ యూనియన్ నాయకుల సమావేశంలో ఏరియా సమస్యల మీద మాట్లాడుతూ సత్తుపల్లిలో డిప్యూటేషన్ రద్దుచేసి తిరిగి పివికే 5 మైన్ కి పంపే ప్రక్రియలో కేవలం ఎల్ హెచ్ డి నడపడానికి ఆర్థరైజేషన్ ఉందన్న నెపంతో పనిగట్టుకుని మరీ కొందరిని టార్గెట్ చేస్తున్నారు అనే ప్రచారం జరుగుతుందని ఆరోపించారు. పద్ధతి ప్రకారంగా కాకుండా డిప్యూటేషన్ కార్మికులలో కొందరిని మాత్రమే పిలవడం వెనక అంతరార్థం ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలు చేపడితే సహించేది లేదని హెచ్చరించారు.

ఏళ్ల తరబడి ఎక్కడ పని చేస్తున్న కార్మికులకు అక్కడే విధులు నిర్వహించే అవకాశం కల్పించాలని హెచ్ఎంఎస్ యూనియన్ డిమాండ్ చేస్తుంది అన్నారు. టెక్నీషియన్స్ సర్ఫేస్ కౌన్సిలింగ్ నిర్వహనలో పారదర్శకత లోపించిందని విమర్శించారు. కార్మికుల్లో వ్యతిరేకత రావడంతో సరిచేసి ఫీల్ అప్ చేయాల్సిన అధికారులు నాయకులు ఒప్పుకోవడం లేదని చెప్పడం సిగ్గుచేటని, నాయకులు ఒప్పుకుంటే చేస్తాం అని మాట్లాడ్డం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవ చేశారు.

పైరవీ కారులకు వత్తాసు పలుకుతూ డిప్యూటేషన్ల పరంపర కొనసాగీస్తున్న మేనేజ్మెంట్, ఇకనైన ఈ దందాకు చరమగీతం పాదలన్నారు. తక్షణమే ఇచ్చిన సర్కులర్ ప్రకారం ఆఫీస్ ఆర్డర్లను ఇష్యూ చేయాలని అన్నారు. సర్ఫేస్ ఖాళీలను భర్తీలో పర్మినెంట్ కౌన్సిలింగ్ నిర్వహించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బ్రాంచ్ సెక్రటరీ, ఆసిఫ్ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, ఆర్ సి హెచ్ పి పిట్ సెక్రెటరీ పూర్ణచందర్, సీనియర్ నాయకులు సత్యనారాయణ, సత్తుపల్లి సమంత పిట్ సెక్రెటరీ నరసింహారావు, పివికే ఫై అసిస్టెంట్ పిట్ సెక్రెటరీ నవీన్, కన్వీనర్ గౌస్, సాయి సందీప్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ హమీద్ ఇతర నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading