బిసి 42శాతం రిజర్వేషన్‌కు చట్టబద్ధత కల్పించాలి

  • బిఆర్‌ఎస్‌ నాయకుడు వనమా రాఘవేందర్‌

కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్రంలో బిసిలకు 42శాతం రిజేర్వేషన్‌లకు చట్టబద్దత కల్పించి తక్షణమే స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్‌ను అమలు చేయాలని బిఆర్‌ఎస్‌ నాయకుడు వనమా రాఘవేందర్‌ డిమాండ్‌ చేశారు. బిసి ప్రజాప్రతినిధుల ఫోరమ్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ ఇందిరా పార్క్‌లో నిర్వహించిన బిసిల మహా ధర్నాలో వనమా రాఘవేందర్‌ హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్థలలో 42శాతం వెనుకబడిన తరగతుల (బిసిపిఎఫ్‌) రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించి వెంటనే ఎన్నికలు నిర్వహించాలి అన్నారు. కామారెడ్డి బిసి డిక్లరేషన్‌లో ప్రకటించిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ బిసిల హక్కుల కోసం సాగుతున్న ఈ పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తున్నామని స్పష్టం చేశారు. కొత్తగూడెం నియోజకవర్గం నుంచి ఈ ధర్నాకు మద్దతు తెలియజేస్తూ వనమా రాఘవేందర్‌ ఆధ్వర్యంలో బిసి నేతలు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు చురుకుగా పాల్గొన్నారు. ఈ ధర్నాలో జాతీయ బిసి సంఘం భద్రాద్రి జిల్లా యువజన అధ్యక్షులు బత్తుల మధుచంద్‌, మాజీ ఆత్మ కమిటీ ఛైర్మెన్‌ బత్తుల వీరయ్య, బిసి నాయకులు ముత్యాల ప్రవీణ్‌, ఎండి హుస్సేన్‌, మధుసూదన్‌ రావు, జూపెల్లి దుర్గా ప్రసాద్‌, బండ్ల పవన్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading