కాలం చెల్లిన సిద్ధాంతాలకు స్వస్తి పలకండి

  • మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు

కొత్తగూడెం: కాలం చెల్లిన సిద్ధాంతాలకు స్వస్తి పలకండి మావోయిస్టులు మారి జనజీవన స్రవంతిలో కలవండి అంటూ మంగళవారం మావోయిస్టులకు వ్యతిరేకంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం అటవీ ప్రాంతాలలో వాల్‌ పోస్టర్లు దర్శనం ఇవ్వడం స్థానికులలో కలకలం రేపింది. కొత్తగూడెంలో టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నీ జగ్గారం, పాలవాగు, గడ్డి గొప్ప గుత్తి కాయ గ్రామ శివారులో మావోయిస్టులకు వ్యతిరేకంగా మావోయిస్టు ఆత్మ పరీక్షలు ప్రజా ఫ్రంట్‌ తెలంగాణ పేరిట వాల్‌ పోస్టర్లు గ్రామ శివారులో పలుచోట్ల అంటించారు. ఇందులో మావోయిస్టులకు వ్యతిరేకంగా పొందుపరిచిన సమాచారం సిద్ధాంతం కోసం అటవీపాలైన అన్నలారా అక్కలారా మీరు నమ్మిన సిద్ధాంతం సామాన్యుడికి ఆశాకిరణం ఎన్నడైందని.

ఆత్మసంతృప్తి లేని ఆత్మగౌరవంతో ముందుకు పోతున్న 40 ఏళ్ల నాటి ఉద్యమ బాట ప్రజాదరణ లేక మండువారిన బీడు భూముల లాగా తయారైందని పేర్కొన్నారు. మావోయిస్టుల అగ్ర నాయకులతోపాటు అందరూ మావోయిస్టులు మారి అడవిని వీడి జనజీవన స్రవంతిలో కి రండి ప్రజాస్వామిక గొంతుక కండని ఆయుధాలను వీడి ప్రజల్లోకి రండంటూ మావోయిస్టులు ఆత్మ పరిరక్షణ ప్రజాఫణి తెలంగాణ పేరిట మావోయిస్టులకు కోరుతూ వాల్‌ పోస్టర్లను అంటించారు. మీ మేధస్సున ప్రజల అభివృద్ధికి ఉపయోగించండి అని కలపత్రాలలో ముద్రించి ఉన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసు బృందం కలపత్రాలపై ఆరా తీస్తున్నారు.

Leave a Reply

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading