ప్రభుత్వ జూనియర్‌ కాలేజిలో మౌలిక వసతులు కల్పించాలి

  • క్యాంపస్‌ హాస్టల్‌ ఏర్పాటు చేయాలి

కొత్తగూడెం : జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థుల అవసారాలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించాలని డిఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు రామ్‌ చరణ్‌ తేజ్‌ డిమాండ్‌ చేశారు. కొత్తగూడెం పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో విద్యార్థులతో డిఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకుడు మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థులకు మినరల్‌ వాటర్‌, వాష్రూమ్స్‌ ఉండేలా ప్రభుత్వం చూడాలన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో క్యాంపస్‌ అటాచ్డ్‌ హాస్టల్‌ ఏర్పాటు చేయాలన్నారు.

జిల్లాలోని అన్ని జూనియర్‌ కళాశాలలో సీజనల్‌ వ్యాధుల వ్యాపిస్తున్న సందర్భంగా ప్రభుత్వమే విద్యార్థులకు హెల్త్‌ చెకప్‌ నిర్వహించాలన్నారు. ప్రభుత్వ విద్యారంగా సమస్యలపై డిఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో భవిష్యత్తులో పోరాటాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. సమస్యలపై పోరాడేటువంటి డిఎస్‌ఎఫ్‌ఐ సంఘంలో విద్యార్థులు పెద్ద ఎత్తున చేరి పోరాటాలలో ముందుండి పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డివిజన్‌ నాయకులు సాగర్‌, జూనియర్‌ కళాశాల విద్యార్థులు శ్రావణ్‌, నిఖిల్‌, జశ్వాంత్‌, కిరణ్‌, ఉదయ్‌ సాత్విక్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading