ఎంపి సార్ సింప్లిసిటీకి జనం ఫిదా
- రోడ్డు పక్కన క్యాన్వాయ్ ఆపి బజ్జిలు తిన్న ఎంపి ఆర్ఆర్ఆర్

కొత్తగూడెం : ఖమ్మం ఎంపీ ఆర్ఆర్ఆర్ సర్ సింప్లిసిటీని చూసిన ప్రతి ఒక్కరు ఆయన్ను ప్రశంసించకుండా వుండలేకపోతున్నారు. అంతెందుకు బజ్జీల కొట్టు బామ్మ కూడా ఆశ్చర్యచకితురాలైంది. ఎంపీ రామసాహాయం రఘురామ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశం అయ్యేందుకు కొత్తగూడెం నియోజకవర్గం లక్ష్మీదేవిపల్లి మండలంలో వానను సైతం లెక్కచేయకుండా విస్తృతంగా పర్యటించారు.
ఈ పర్యటనలో భాగంగా సాయంత్రం వేళ గౌండ్ల రామవరం ప్రభుత్వ పాఠశాల సమీపంలో కార్యకర్తలతో సమావేశం ముగించుకుని తిరుగు ప్రయాణంలో రోడ్డు పక్కనే పాకలో బజ్జీల కొట్టు నిర్వహిస్తున్న జయలక్ష్మి అనే మహిళ వద్ద తన కాన్వాయ్ ఆపి ఎలాంటి హడావుడి లేకుండా ఆమెతో ముచ్చటించి, ఎంపీ బజ్జీలు కొని తనతోపాటు కార్యకర్తలకు తినిపించారు. అయితే అప్పటివరకు ఎవరో చోట మోట రాజకీయ నాయకుడు అనుకున్న బజ్జీల కొట్టు బామ్మ స్వయంగా ఎంపీ తన చేత్తో చేసిన బజ్జీలు తిన్నారనే విషయం తెలియడంతో ఆమె ఒక్కసారిగా సాంబ్రాచర్యంలో మునిగిపోయింది.
ఆమె ఆనందానికి అవదులు లేకుండాపోయాయి. వెంటనే తేరుకుని తాను మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ అభిమానినే అని తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలనీ కోరారు. అర్హులైన అందరికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయ్యేలా చూస్తామని ఎంపి హామీ ఇవ్వడంతో జయలక్ష్మి సంతోషం వ్యక్తం చేశారు.
ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల జీవితం ఎంత విలాసవంతంగా ఉంటుందో మనకు తెలియంది కాదు. కూర్చున్న చోటే కోరుకున్నవి అన్ని చిటికెలో సమకూరతాయి. నాయకుల పర్యటనల సమయంలోను మాములు హడావుడి ఉండదు. పోలీసులు, భద్రతా సిబ్బంది, చుట్టు ఉండే అభిమానులతో హడావిడి కనిపిస్తుంది. కానీ ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డి సింపుల్ సిటీ గా ఉండే ఆయన వ్యక్తిత్వాన్ని చూసిన ప్రతి ఒక్కరి మనసులను చూరగొంటున్నది. దీంతో నాయకుడు అంటే ఇలా ఉండాలి అంటూ ప్రజలు ఎంపి సార్ ను ప్రశంసించకుండా వుండలేకపోతున్నారు.