పహల్గామ్‌ ఉగ్రవాదుల దాడి పిరికిపంద చర్య

ముష్కరులు కఠినంగా ధికాధించాలి
వీర్‌ శివాజీ మహరాజ్‌ సేనా వ్యవస్తాపకుడు ప్రదీప్‌

కొత్తగూడెం: పహల్గామ్‌లో మతోన్మాదపు ఉగ్రవాదుల దాడితో దేశం అంతా దిగ్బ్రాంతికి గురైతందని, ఉగ్రదాడిని పిరికిపంద చర్య అని వీర్‌ శివాజీ మహరాజ్‌ సేనా వ్యవస్తాపకుడు జోగు ప్రదీప్‌ అన్నారు. జమ్మూ కాశ్మీర్‌ అనంతనాగ్‌ జిల్లాలోని పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడికి వ్యతిరేకంగా కొత్తగూడెం పట్టణంలో ఆగ్రహశ్వాలలు పెల్లుబిగిశాయి.

పార్టీలకు అతీతంగా నేతలు, ప్రజా సంఘాలు, హిందూ సంఘాలు ఉగ్రవాద ఘటనను తీవ్రంగా ఖండిరచాయి. పర్యాటకులపై దాడిని నిరసిస్తూ కొత్తగూడెం పట్టణంలో క్యాండిల్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రదీప్‌ మాట్లాడుతూ మతోన్మాదుల ఉగ్రదాడితో దేశం అంతా దిగ్బ్రాంతికి గురైతందని చేశారు. ఉగ్రవాదుల దాడిలో 26 మంది పర్యాటకులు మరణించారు.

విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 26 మంది మృతి చెందగా అనేక మంది గాయపడినట్లు సమాచారం. 2019 పుల్వామా దాడి తరువాత లోయలో జరిగిన అత్యంత ఘోరమైన దాడిలో ఇది ఒకటి అని అభివర్ణించారు.దాయాది దేశం పాకిస్తాన్‌ తీవ్రవాదాన్ని పెంచి పోశిస్తూ భారత్‌లో ఉగ్ర దాడులను ప్రేరేపిస్తుందని మండి పడ్డారు.మతోన్మాదులు ఉగ్రవాద ముసుగులో అకృత్యాలకు పాల్పడుతూ అమాయక ప్రజల ప్రాణాలను హరించడం పరిపాటిగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకా ఎన్నాల్లు ఈ రక్తపాతం అని ఆక్రోశం వెల్లగక్కారు. ఇక పాకిస్తాన్‌ కుయుక్తులను ఉపేక్షించకూడదని, శత్రు దేశం పాకిస్తాన్‌కు తగిన బుద్ది చెప్పాల్సిన సమయం ఆసన్నం అయ్యిందన్నారు.

పాకిస్తాన్‌ ముర్దాబాద్‌ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ముందుగా గణేష్‌ టెంపుల్‌ నుండి బస్టాండ్‌ సమీపంలోని అమరవీరుల స్థూపం వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి క్యాండిల్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహేష్ అక్కిరెడ్డి , దిలీప్, కిరణ్, చింటూ, డివిపి యాదవ్, సాగర్, కౌశిక్, విజయ్, విగ్నేష్ అఖిల్, కళ్యాణ్, లోకేష్, నాగార్జున, బండి భాస్కర్, కూరపాటి రాజేష్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading