రాష్ట్రంలో అరాచక పాలన

  • కెసిఆర్‌ పాలనను కోరుకుంటున్న ప్రజలు
  • మాజీ మంత్రి వనమా

కొత్తగూడెం : తెలంగాణ కొనసాగుతున్నది ప్రాజా పాలన కాదని, రాష్ట్రంలో ఎటు చూసినా అరాచకం, అశ్రీత పక్షపాతమే కనిపిస్తుంది మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్చార్జ్‌ వనమా వెంకటేశ్వరరావు విమర్శించారు. రాష్ట్రం సబ్బండ వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్‌ పార్టీ పిలుపు మేరకు కొత్తగూడెం పట్టణంలో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా వనమా మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్‌ ప్రభుత్వం పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

మాజీ సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ నాయకత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామని హెచ్చరిచారు. తెలంగాణలో ప్రజా పాలన పేరుతోటి అధికారంలోకి వచ్చి రాక్షస పాలన చేస్తున్నారని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. 420 వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ఇచ్చిన వాగ్దాన నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ప్రజల అసహ్యించుకుంటున్నారని ఎద్దేవ చేశారు.హెచ్‌సియూలో నిరసన తెలుపుతున్న విద్యార్థులను, మహిళా విద్యార్థులని చూడకుండా బట్టలు చిరిగేలా కొట్టిన పోలీసుల వైఖరిని తీవ్రంగా ఖండిరచారు.

హెచ్‌సియూ భూములను అక్రమంగా అర్ధరాత్రి పూట బుల్డోజర్లతో ఖాళీ చేయిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ప్రజాస్వామిక వాదులు ఖండిరచాలని విజ్ఞప్తి చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి, కళ్ళకు గంతలు కట్టుకుని బిఆర్‌ఎస్‌ కార్యకర్తలతో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. పోస్టాఫిస్‌ సెంటర్‌లోని అంబేడ్కర్‌ విగ్రహంవద్ద ధర్నా చేపట్టారు. అనంతరం కాంగ్రెస్‌ 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రజలను మోసం చేసిందంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వం పై కొత్తగూడెం వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్లో సిఐ కరుణాకర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేందర్‌ గారు, మాజీ మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ కాపు సీతాలక్ష్మి, మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ దామోదర్‌ యాదవ్‌, మాజీ ఎంపీపీ బాదవత్‌ శాంతి, మాజీ కౌన్సిలర్లు అంబుల వేణు, రుక్మందర్‌ బండారి, నాగబాబు, రాజేంద్రప్రసాద్‌, జానీ, తాండ్ర శీను తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading