కళాకారుల ప్రోత్సాహానికి ఎల్లవేళలా సిద్దం
- టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు

పాల్వంచ : గత 22 సంవత్సరాలుగా ఎన్నో వ్యయ ప్రయాసాలకోర్చి పాల్వంచ కళా పరిషత్ సేవాసమితి ఆధ్వర్యంలో ఎంతో అట్టహాసంగా ఉగాది సంబరాలు నిర్వహించడం పలువురికి ఆదర్శంగా నిలుస్తుందని టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు అన్నారు. ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించిన కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. మున్ముందు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని, వాటికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్న ఆయన మన సంస్కృతి సంప్రదాయాలు మరుగున పడుతున్న వేళ ఉగాది పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని ఇంతటి మంచి కార్యక్రమాన్ని చేయడం కొత్తగూడెం, పాల్వంచ ప్రజల అదృష్టమన్నారు. రాబోయే రోజుల్లో కళాకారులకు పెద్ద పీట వేసే విధంగా తను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని అన్నారు.
సనాతన ధర్మాన్ని మరియు సంప్రదాయాలను కాపాడటంలో ప్రతిఒక్కరు ముందుండాలన్నారు. ఈ సంవత్సరమంతా వ్యాపార అభివృద్ధిలో, అష్టఐశ్వర్యాలు, సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలందరికి శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసారు. వేముల కొండలరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాజుగౌడ్, డాక్టర్ సుధాకర్ బాబు, యుగేందర్ రెడ్డి, బుచ్చయ్య చౌదరి, రోషయ్య, లింగమూర్తి, పురప్రముఖులు,కళాకారులు పాల్గొన్నారు.