కెటిపిఎస్‌లో ఉద్యోగాలు కల్పించాలి

  • 6వ దశ నిర్మాణ కార్మికుల దీక్షకు బిజెపి మద్దతు

పాల్వంచ : కెటిపిఎస్‌ అంబేద్కర్‌ సెంటర్‌లో 6వ దశ నిర్మాణ కార్మికులు చేస్తున్న దీక్షకు మద్దతు తెలిపిన బీజేపీ ఆధ్వర్యంలో మద్దతు తెలిపారు. అనంతరం దీక్ష చేస్తున్న కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ గతంలో 6వ దశ నిర్మాణంలో కీలక పాత్ర పోశిషించిన కార్మికులకు నిర్మాణం అనంతరం ఉద్యోగ అవకాశం కల్పిస్తామని ఖితపూర్వకంగా హామీ ఇచ్చి జెన్కో యాజమాన్యం విస్మరించిందని విమర్శించారు. గత ప్రభుత్వం కార్మికులకు న్యాయం చేస్తామని మాటలకు పరిమితమైంది తప్పా ఎటువంటి న్యాయం చెయ్యలేదు అన్నారు. నిర్మాణంలో ఎటువంటి సంబంధం లేని వారికీ ఆర్టిజన్‌ పోస్ట్లు ఇచ్చినారని, నిర్మాణంలో ప్రాణాలకు తెగించి కష్టబడ్డ కార్మికులకు మాత్రం అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏళ్ళ తరబడి 6వ దశ కార్మికులు ఉద్యోగాల కోసం పోరాటం చేస్తున్న గతంలో బిఆర్‌ఎస్‌, నేడు కాంగ్రెస్‌ ప్రభుత్వాలు పట్టించుకోక పోవడం బాధాకరం అన్నారు. తక్షణమే ప్రభుత్వం, జెన్కో యాజమాన్యం కార్మికులతో చర్చలు జరిపి న్యాయం చెయ్యాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో కార్మికులు చేసే న్యాయమైన పోరాటానికి బీజేపీ పూర్తి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం లో బీజేపీ మాజీ పట్టణ అధ్యక్షులు గంధం ప్రసాద్‌ గౌడ్‌, ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు, పట్టణ ప్రధాన కార్యదర్శి మాదారపు లక్ష్మణ్‌,ఎస్టీ మోర్చ జిల్లా కార్యదర్శి మాలోత్‌ ప్రశాంత్‌ నాయక్‌, కార్మిక సంఘ నాయకులు వాంకుడోత్‌ హాథిరామ్‌, బి మురళి ,రెహమాన్‌,మల్లేష్‌, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from Slide News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading